సాక్షి, చెన్నై : రాజకీయ చైతన్యం అధింగా ఉండే తమిళనాడులో.. తాజాగా ఇద్దరు నటులు రాజకీయ అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార పీఠాన్ని అధిరోహించిన డీఎంకే, అన్నాడీఎంకే, ఇతర పార్టీల స్థితిగతులపై ఇండియా టుడే-కార్వి ఇన్‌సైట్స్ సంస్థ మొత్తం 77 నియోజకవర్గాల్లో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే.. అధికార అన్నాడీఎంకే చావు దెబ్బతింటుందని సర్వే చెబుతోంది. వాస్తవంగా తమిళనాడు అసంబ్లీకి 2021లో ఎన్నికలు జరగాల్సివుంది.
దాదాపు ఏడాదికాలంగా తమిళనాడులో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జయలలిత మరణం తరువాత.. ఇక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంతో.. ప్రధాన పార్టీలు ఆలోచనలో పడిపోయాయి. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై నిర్వహించిన సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి.
ఒపీనియన్ పోల్ ముఖ్యాంశాలు
- ఈ ఏడాది ఎన్నికలు జరిగితే ప్రస్తుత అధికార అన్నాడీఎంకేకు 26 శాతం ఓటు షేర్‌తో 68 వరకూ సీట్లు లభించే అవకాశం ఉంది.
- డీఎంకే కూటమికి 34 శాతం ఓట్ షేర్‌తో 134 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
- తమిళ సూపర్ స్టార రజనీకాంత్ పార్టీ.. 16శాతం ఓట్లతో 33 స్థానాల్లో విజయం సాధించవచ్చు.
- ఇదిలావుండగా.. రజనీకాంత్ ఇప్పటివరకూ పార్టీ పేరును, అజెండాను ప్రకటించలేదు. రజనీకాంత్ ప్రచారం మొదలు పెడితే... ఓట్ల శాతంలో మార్పులు ఉండొచ్చని సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment