రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళల రక్షణ కోసం మొబైల్ ఫోన్ యాప్ను కేంద్ర హొం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. 'హిమ్మత్' అనే ఈ యాప్ను ప్రాధమికంగా తొలుత ఢిల్లీలో్ ప్రవేశపెట్టారు. స్మార్ట్ఫోన్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఫోన్లోని ఒక బటన్ నొక్కగానే పోలీస్ కంట్రోల్ రూమ్కు కాల్ వెల్లడంతోపాటు 30 సెకండ్ల ఆడియో, వీడియో కూడా రికార్డు అవుతుంది. యాప్స్ డేటాలో అత్యవసరంగా సంప్రదించే మరో అయిదుగురు బంధువులు, స్నేహితుల ఫోన్ నెంబర్లను కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ప్రమాదంలో ఉన్న యువతి తన ఫోన్ బటన్ నొక్కగానే పోలీసులతోపాటు తమ బంధుమిత్రులకు కూడా ఆ సమాచారం వెళుతుంది.
ఈ యాప్ ప్రారంభించే సందర్భంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ పోలీస్ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ఆ దిశంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పోలీస్ శాఖలలో మహిళల రిజర్వేషన్ కోటాని 33 శాతానికి పెంచాలని ఆయన సలహా ఇచ్చారు.