Himmat
-
హిమ్మత్ సింగ్ సెంచరీ: భారత్ హ్యాట్రిక్
కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎమర్జింగ్ కప్ టోర్నీలో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లో సోమవారం ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హిమ్మత్ సింగ్ (126 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. ఫెర్నాండో (80; 6 ఫోర్లు, 1 సిక్స్), గుణరత్నే (67 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో శివమ్ మావి 3, ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 47.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి గెలిచింది. 20 పరుగులకే 2 టాపార్డర్ వికెట్లను కోల్పోయిన భారత్‌ను హిమ్మత్, రుతురాజ్ గైక్వాడ్ (67; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 148 పరుగులు జోడించడంతో భారత్ విజయం సులువైంది. ఈ టోర్నీలో ఇదివరకే సెమీస్ చేరిన భారత్ అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. గురువారం జరిగే సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో భారత్; బంగ్లాదేశ్‌తో శ్రీలంక తలపడతాయి. -
ఢిల్లీ మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళల భద్రత కోసం ఆండ్రాయిడ్ మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. ఈ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నవారు ఆపద సమయంలో ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ప్రవేశపెట్టిన మొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ ఇదని చెప్పారు. ఆడియో, వీడియోలను రికార్డు చేయడంతో పాటు ఐదుగురు సన్నిహితులకు సమాచారం అందించేందుకూ ఈ యాప్‌తో వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు తదితరులు హాజరయ్యారు. -
నగర మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’
సాక్షి, న్యూఢిల్లీ : నగర మహిళల భద్రతకు ఉద్దేశించిన మొబైల్ అప్లికేషన్ ‘హిమ్మత్’ను కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ఆవిష్కరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నగరంలో అందుబాటులోకి వచ్చిన ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో పాటు పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్సీ మాట్లాడుతూ హిమ్మత్ అప్లికేషన్ మహిళకు భద్రతను పెంపొదిస్తుందని చెప్పారు. ఈ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నవారు ఆపద సమయంలో మొబైల్ ఫోన్‌ను ఊపటం లేదా పవర్ బటన్ని రెండుసార్లు నొక్కటం ద్వారా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయవచ్చని తెలిపారు. ఈ అప్లికేషన్ నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమై ఉంటుందని, పోలీసులకు వెంటనే సూచన అందుతుందని, ఆ తరువాత లొకేషన్ గుర్తిస్తారని, ప్రతి పది సెకన్లకు ఓసారి అప్డేట్ అందుతుందని ఆయన చెప్పారు. వీలైనంత ఎక్కువమంది మహిళలు ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇది మహిళల భద్రత కోసం దేశంలో మొట్టమొదటి అధికారిక ఏకీకృత అప్లికేషన్ అని బస్సీ తెలిపారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్ హిమ్మత్‌ను రూపొందించారు.అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తులను చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. నిర్థారిత సమయం పాటు పవర్ బటన్ నొక్కిన వెంటనే ఇది పోలీసు కంట్రోల్ రూముకు కాల్ చేయడానికి వీలు కల్పించడంతో పాటు 30 సెకన్ల ఆడియా, వీడియో రికార్డింగ్ కూడా చేస్తుంది. వినియోగదారులు తమ ఐదుగురు మిత్రులు లేదా బంధువుల నంబర్లను మొబైల్ ఫోన్లో ఫీడ్ చేయాల్సిందిగా ఈ యాప్ వినియోగదారులకు సూచిస్తుంది. ఆపద సమయంలో వినియోగదారులు ఒకవేళ ఎస్ఓఎస్ కాల్ చేసినప్పటికీ వెంటనేవారు ఫీడ్ చేసిన ఐదు నంబర్లకు కూడా తక్షణమే సందేశం అందుతుంది.ఈ విధంగా పోలీసులే కాకుండా, బంధుమిత్రులు కూడా ఆపదలో ఉన్న మహిళకు సహాయం అందించగలిగే వీలుంటుందని పోలీసులు చెప్పారు. ఈ యాప్‌తో జరిపే ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా పనికివస్తుందని వారు వివరించారు. -
మహిళల రక్షణ కోసం మొబైల్ యాప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళల రక్షణ కోసం మొబైల్ ఫోన్ యాప్‌ను కేంద్ర హొం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. 'హిమ్మత్' అనే ఈ యాప్‌ను ప్రాధమికంగా తొలుత ఢిల్లీలో్ ప్రవేశపెట్టారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఫోన్లోని ఒక బటన్ నొక్కగానే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వెల్లడంతోపాటు 30 సెకండ్ల ఆడియో, వీడియో కూడా రికార్డు అవుతుంది. యాప్స్ డేటాలో అత్యవసరంగా సంప్రదించే మరో అయిదుగురు బంధువులు, స్నేహితుల ఫోన్ నెంబర్లను కూడా పొందుపరిచే అవకాశం ఉంది. ప్రమాదంలో ఉన్న యువతి తన ఫోన్ బటన్ నొక్కగానే పోలీసులతోపాటు తమ బంధుమిత్రులకు కూడా ఆ సమాచారం వెళుతుంది. ఈ యాప్ ప్రారంభించే సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ పోలీస్ విభాగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ఆ దిశంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని పోలీస్ శాఖలలో మహిళల రిజర్వేషన్ కోటాని 33 శాతానికి పెంచాలని ఆయన సలహా ఇచ్చారు.