వచ్చే నెల 3న నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు.
న్యూఢిల్లీ: వచ్చే నెల 3న నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం కానున్నారు. నక్సల్స్ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. మొత్తం 7 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, సీఎస్లు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. నక్సల్స్ ప్రభావాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఏపీ, తెలంగాణలతో పాటు ఒడిసా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లో కలిపి 31 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలో విశాఖ, తెలంగాణలో ఖమ్మం అతి తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్ర హోంశాఖ అధికారులు పరిగణిస్తున్నారు.