జైపూర్: రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. సవాయ్ మాన్‌సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని దుండగులు మూడేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఆసుపత్రిలో తల్లి నిద్రిస్తుండగా చిన్నారిని ఎత్తుకెళ్లారు. ఆదివారం పొద్దున ఆసుపత్రి గేటు వద్ద ముఖం, మెడపై గాయాలతో నెత్తురోడుతూ ఏడుస్తున్న బాలిక కనిపించింది. స్థానిక జేకే ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించారు. పాప ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నారులపై ఇక్కడ అత్యాచారం జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈనెల 11న కిడ్నాప్, ఆ తర్వాత అత్యాచారానికి గురైన మూడేళ్ల బాలికను ఆగ్రా జాతీయ రహదారిపై గుర్తించారు.
బ్రిటన్‌లో టీనేజ్ బాలికపై అఘాయిత్యం
లండన్: బ్రిటన్‌లోని ఎప్సమ్ ప్రాంతంలో ఓ టీనేజ్ బాలిక(17)పై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి ఎప్సమ్‌లోని పిజ్జా హట్ రెస్టారెంట్లో ఉన్న ఆమెను 32 ఏళ్ల వ్యక్తి బలవంతంగా సమీప ప్రాంతానికి ఈడ్చుకుపోయి అత్యాచారం చేశాడు. తర్వాత కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బాలికను పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. నిందితుడిని సర్రీ ఏరియా పోలీసులు అరెస్టు చేశారు.
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Published Mon, Jun 20 2016 1:21 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
Advertisement
Advertisement