పార్లమెంట్ సమావేశాల కోసం విపక్షాలు సమాయత్తం
న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న కరువుపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం మొదలుకానున్న మలివిడత బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించాలని సభ్యులు కొందరు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. కరువు, నీటి ఎద్దడిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్, కేసీ త్యాగి(జేడీయూ) సతీష్ చంద్ర మిశ్రా (బీఎస్పీ) తదితరులు.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, వడగాడ్పుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని కోరుతూ సభ చైర్మన్‌కు నోటీసులు ఇచ్చారు. వీటిని స్వీకరించిన సభ 27న చర్చ ఉంటుందని ప్రకటించింది. కరువు రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు చేయాలని ప్రధానికి కాంగ్రెస్ సూచించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్‌సింగ్ స్పందిస్తూ... రాష్ట్ర ప్రభుత్వాల వద్ద రూ.1,500 కోట్ల మిగులు నిధులున్నాయని, వాటితో నీటి ఎద్దడి నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు.
రేపు లోక్‌సభ అఖిలపక్షం..బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని పార్టీలను కోరనున్నారు.
కరువుపై చర్చకు రెడీ
Published Sat, Apr 23 2016 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement