గౌరవప్రదంగా రిజర్వేషన్లు ఇవ్వాలి
మహిళా రిజర్వేషన్లపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
స్త్రీలు నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి రంగం శోభిల్లుతోంది
(పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు గౌరవప్రదంగా ఇవ్వాలే తప్ప వివాదాలు, విభేదాలతో కాదని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాజకీయ పక్షా లకు హితవు పలికారు. మహిళలకు రిజర్వే షన్లు ఇవ్వడమంటే జాతి నిర్మాణానికి దోహద పడడమన్నారు. మహిళలకు నిర్ణయాధికారం తోనే జాతికి జవసత్వాలని చెప్పారు. విజయ వాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో మూడు రోజులుగా జరుగుతున్న తొలి జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు ఆదివారం ముగిశాయి. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమిత్ర మాట్లాడారు.
మహిళ లకు రిజర్వేషన్లు పురుషులు ఇచ్చినట్టు.. వాళ్లు తీసుకున్నట్టు ఉండకూడదన్నారు. ఎవ్వరూ మరొకరికి ఏమీ ఇవ్వలేరని చెప్పారు. ‘‘దేశ జనాభాలో సగం మహిళలు. కానీ జాతి నిర్మా ణంలో మాత్రం యావత్తు (పుల్‌రౌండ్) మహి ళలే. కుటుంబాన్ని నడుపుతున్నది వారు. కుటుంబ సంరక్షకులు వారు. కుటుంబానికి జన్మనిస్తున్నది వారు. ఎవరో అడిగితే వాళ్లు ఆ పని చేయడం లేదు. రిజర్వేషన్లు కూడా అంతే. కానీ పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కొందరు వద్దంటారు, ఇంకొం దరు కావాలంటారు. ఈతరహా తీరును మనం కోరుకోవడం లేదు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడ మంటే జాతి నిర్మాణానికి సహకరించడం. ఆమెకు అర్హమైంది ఆమెకు ఇవ్వడం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహక రించాలి’’ అని మహాజన్ కోరారు.
మహిళా శక్తి కేంద్రం ఏపీ...
మహిళ అంటే కళ్యాణి అని, శక్తి స్వరూపిణి అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్‌లో సాకారాత్మక శక్తియుక్తులున్న మహిళలున్నారని మహాజన్ చెప్పారు. మహిళ ఎక్కడుంటే అక్కడ పవర్(శక్తి) ఉంటుందన్నారు. మహిళలు నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి రంగం శోభిల్లుతోందన్నారు. పార్లమెంటు సభ్యుల కోసం ఏర్పాటు చేసిన స్పీకర్స్ పరిశో ధనా సంస్థలోనూ మహిళల ప్రాతినిధ్యమే ఎక్కువ గా ఉంటుందన్నారు. పర్యావరణ పరిశుభ్ర తకు, వాతావరణ పరిరక్షణకు పాటు పడుతున్నదీ మహిళలేనని చెప్పారు.
నది ఎవరితోనైనా కొట్లాడుతుందా?
స్త్రీని నదితో పోల్చిన సుమిత్రా మహాజన్ జీవిత సాఫల్యానికి నది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. నదీ ప్రవాహానికీ ఎక్కడైనా ఆటంకం కలిగితే ఆ పక్క నుంచి పోతుందే గానీ ఎవ్వరిపైనా పోరాటానికి దిగదని, మహిళ కూడా అంతేనని చెప్పారు. స్త్రీ ఉద్దేశం పురుషునిపై పోరాటం కాదన్నారు. మహిళల సాధికారతకు తాము ఇప్పటికే రెండు సమా వేశాలు నిర్వహించామన్నారు. మహిళా జాతీయ పార్లమెంటును ముందుకు తీసుకు వెళ్లేందుకు సహకారాలను అందిస్తామన్నారు.
తల్లికి వందనం పేరిట కార్యక్రమం...
మాతృమూర్తికి గౌరవ ప్రతిష్టలు చేకూరేలా ఇకపై ఏడాదిలో ఒకరోజు తల్లికి వందనం పేరిట విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించ నున్న ట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటిం చారు. ఇండోనేషియాలో మాతృది నోత్సవం నిర్వహిస్తున్నట్టే ఆంధ్రాలోనూ చేపట్టనున్నట్టు తెలిపారు. తల్లికి వందనం పేరిట స్కూళ్లు, కళాశాలల్లో ఓ రోజు మాతమూర్తులను పిలిపించి వారి పిల్లలతో కాళ్లు కడిగించి ఆశీర్వచనం తీసుకునేలా చేస్తామన్నారు. 33 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయ్యేందుకు సుమిత్రా మహాజన్‌ను నాయకత్వం వహించాల్సిందిగా కోరారు. మహిళల ఆర్థికాభివృద్ధి, ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అమరావతి డిక్లరేషన్ ఇప్పుడే కాదు...
జాతీయ మహిళా పార్లమెంటు సందర్భంగా అమరావతి డిక్లరేషన్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఆ కల నెరవేరలేదు. లింగ వివక్ష, మహిళా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఐక్యరాజ్య సమితికి మధ్య అవగాహన కుదిరినందున డిక్లరేషన్ చేయలేక పోయినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎంవో యూలోని అంశాలను ఐక్యరాజ్య సమితి బృందం పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇస్తుందని, ఎంత మంది మద్దతు ఇస్తారో తెలుస్తుందని, అది పరిశీలించి డిక్లరేషన్ ప్రకటిస్తామని వివరించారు. ముగింపు కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది మీనాక్షీ లేఖి, ప్రముఖ నృత్యకా రిణి డాక్టర్ సోనాల్ మాన్‌సింగ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ, తెలంగాణ శాసనమండలి చైర్మన్లు చక్రపాణీ, స్వామిగౌడ్, సెర్ప్ సలహాదారు విజయభారతి తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో లోక్‌సభ స్పీకర్
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమం): లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణా నికి చేరుకున్న స్పీకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఆలయ ఈవో సూర్యకుమారి అమ్మవారి చిత్ర పటాన్ని, ప్రసాదాలు అందజేశారు.