బీఫ్ బ్యాన్‌పై కూడా తేల్చేస్తారా?
బీఫ్ బ్యాన్‌పై కూడా తేల్చేస్తారా?
Published Fri, Aug 25 2017 3:07 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని స్పష్టమైన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై కూడా ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు కూడా. అయితే 24 గంటలు గడవక ముందే ఓ కీలక అంశంపై పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది.
మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్‌పై సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ శుక్రవారం ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ఈ అంశంపై ముమ్మాటికీ వ్యక్తిగత గోప్యత తీర్పు ప్రభావం ఉంటుందని చెప్పటం వ్యాఖ్యానించటం విశేషం. ఓ వ్యక్తి ఎలాంటి బట్టలు వేసుకోవాలో. ఏం తినాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని గురువారం తీర్పు సందర‍్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ గోమాంసం తినటంపై ప్రభుత్వం బ్యాన్ విధించటం సరికాదంటూ ఇందిర వాదన వినిపించారు.
వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు ఏకే సిక్రీ మరియు అశోక్ భూషణ్‌లు ఇది వ్యక్తిగత గోప్యత(ప్రాథమిక హక్కు) కిందకే వస్తుందని చెబుతూ తదుపరి వాదనను రెండు వారాలపాటు వాయిదా వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన బీఫ్ బ్యాన్ ఆదేశాలను గతేడాది బాంబే హైకోర్టు తప్పుబడుతూ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది కూడా.
Advertisement
Advertisement