వరదలపై మోదీ, నితీశ్ ఏరియల్ సర్వే
రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో చునాపూర్ విమానాశ్రయంలోనే ప్రధాని సమీక్ష నిర్వహించారు. బిహార్‌కి అవసరమైన సహకారాన్ని అందజేస్తామని హామీనిచ్చారు. వరదల ప్రభావం సుమారు 19 జిల్లాలపై పడిందని, 13 జిల్లాల్లో దారుణంగా నష్టం వాటిల్లిందని ప్రధాని పేర్కొన్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమయ్యారు. పూర్ణియా, కటిహార్, కిసాన్‌గంజ్, అరేరియా జిల్లాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదల వల్ల బిహార్‌లో 449 మంది మృత్యువాత పడగా, 1.67 కోట్ల మంది ప్రజలు ప్రభావితులయ్యారు.