బీహార్‌కు భారీగా ఆర్థికసాయం
బీహార్: రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రోజు ఉదయం పూర్ణియా చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మోదీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు. సర్వే అనంతరం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రూ. 500 కోట్ల ఆర్థిక సహాయం అందించన్నట్లు ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ కేంద్ర బృందాన్ని పంపిస్తామని హామీ ఇచ్చారు.
దేశ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరద కారణంగా బీహార్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగాయి. వరదల కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగింది.