
వారి ఖాతాల్లో అవాక్కయ్యేన్ని కోట్లు
అంతేకాకుండా, చిన్నమొత్తాల్లో అంటే రూ.30 వేల నుంచి రూ.50వేల డబ్బును దాదాపు 4.86లక్షల ఖాతాల్లో జమచేయగా అది రూ.2,000కోట్లు అయినట్లు ఐటీ శాఖ అధికారుల వద్ద వివరాలు ఉన్నాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 23 మధ్య కాలంలో మొత్తం రూ.41,523కోట్ల మొత్తాన్ని 48లక్షల ఖాతాల్లో జమచేసినట్లు తెలిసింది. అంతకుముందు నవంబర్ 9నాటికి జన్‌ధన్ ఖాతాల్లో రూ.45,637 కోట్లు వచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.
'జన్ ధన్ ఖాతాల్లో అంతకుముందున్న సొమ్ముకు రెట్టింపు జమ చేసినట్లు తెలిసింది. దీని వివరాలన్ని క్రోడికరించి ఖాతా కలిగిన వారు తప్ప మిగితా వారు జమ చేసినట్లు గుర్తిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం' అని కేంద్రంలోని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తొలి రెండు వారాల్లో జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు అమాంతం పెరిగాయని, ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయని పేర్కొన్నారు.