డామేజ్ కంట్రోల్ దిశగా ఆర్ ఎస్ ఎస్? | RSS in Damage Control Mode? | Sakshi
Sakshi News home page

డామేజ్ కంట్రోల్ దిశగా ఆర్ ఎస్ ఎస్?

Published Mon, Feb 16 2015 11:36 PM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

డామేజ్ కంట్రోల్ దిశగా ఆర్ ఎస్ ఎస్? - Sakshi

డామేజ్ కంట్రోల్ దిశగా ఆర్ ఎస్ ఎస్?

న్యూఢిల్లీ: ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంతో దెబ్బతిన్న పార్టీ ప్రతిష్టను తిరిగి గాడినపెట్టేందుకు దాని సిద్ధాంతకర్త ఆర్ ఎస్ ఎస్ చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...ఈ సంవత్సరం జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. బీహార్లో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం సమావేశమైన పార్టీ చర్చించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీహార్ ఇన్చార్జ్ భూపేంద్ర యాదవ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు పాల్గొన్నారు.
  బీజేపీ ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఆర్ ఎస్ ఎస్ ఇలాగే జోక్యం చేసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘనవిజయంతో జోరుమీదున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్రమోడీకి పెద్ద షాకే ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లకు 67 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement