కేంద్రానికి మంత్రి మహేందర్‌రెడ్డ్డి విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా సంస్థను వీలైనంత త్వరగా విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిం చారని పేర్కొన్నారు. కేంద్ర ఉపరిత రవాణాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత సదస్సులో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 1998 మోటార్ వాహనాల చట్టం రద్దు చేస్తూ 2014 చట్టాన్ని తీసుకురావడంపై అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఆర్టీసీ, రవాణా సంస్థ బస్సులు, ట్యాక్స్‌లు, లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ వంటివన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళితే రాష్ట్రాల ఉనికి కోల్పో తాయని, ఈ చట్టానికి టీ సర్కార్ వ్యతిరేకమని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఆర్టీసీని త్వరగా విభజించండి: మహేందర్‌రెడ్డ్డి
Published Wed, Oct 29 2014 1:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM
Advertisement