mahinder reddy
-
బెస్ట్ కోవిడ్ వారియర్ ఆఫీసర్‌గా డీఐజీ సుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బెస్ట్ కోవిడ్ వారియర్ విమెన్ ఆఫీసర్‌గా డీఐజీ బడుగుల సుమతిని డీజీపీ ఎంపిక చేశారు. కోవిడ్ విజృంభించిన వేళ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కాలంలో పోలీసులు అందించిన సేవలు మరువలేనివి. మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకుపైగా పోలీసులు వైరస్ బారిన పడగా.. దాదాపు 70 మంది పోలీసులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పోలీసు అధికారుల వివరాలు అందజేయాలని నేషనల్ విమెన్ కమిషన్ (ఎన్సీ డబ్ల్యూ) అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీంతో తెలంగాణ నుంచి డీఐజీ బడుగుల సుమతి పేరుని సోమవారం డీజీపీ డాక్టర్ ఎం.మహేందర్ రెడ్డి ఖరారు చేశారు. (చదవండి: ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి) డీఐజీ సుమతి లాక్డౌన్ కాలంలో డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సేవలందించారు. లాక్డౌన్ కాలంలో పేదలు, వలస కూలీలు, అన్నార్థులకు ఎక్కడికక్కడ ఆహారం, మందులు, బియ్యం, దుస్తులు చేరేలా నిరంతరం పర్యవేక్షించారు. అదే విధంగా అత్య వసర సేవలు, రాష్ట్రంలోనికి రావాల్సిన దిగు మతులు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఎగుమతులకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించే బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. -
దుబ్బాక ఎన్నికలు: డీజీపీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దుబ్బాక లో పోలింగ్ మొదలు కాగానే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ,బీజేపీలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ అభ్యర్ధి టీఆర్ఎస్లో చేరినట్లు ప్రముఖ టీవీ ఛానెల్లో బ్రేకింగ్ నడిచినట్లు ఒక వీడియో సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన ఆ టీవీ ఛానెల్ కూడా మేము ప్రసారం చేయలేదని చెప్పింది. ఓటమి భయం తో హరీష్ రావు, రఘనందన్ చేసిన కుట్రే ఇది. ఈ కుట్రపై డీజీపీ కి ఫిర్యాదు చేశాం. కేరళలో ఇదేవిధంగా దుష్ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ గెలిచిన అభ్యర్థిని డిస్ క్వాలిఫై చేసింది. కేరళ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తాం’ అని అన్నారు. మరో కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ‘దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు రావడంతోనే టీఆర్ఎస్, బీజేపీలు సరికొత్త కుట్రకు తెరతీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నాడని తమకు అనుకూలమైన మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉన్నది లేన్నట్టు.. లేనిది ఉన్నట్టు గోబెల్స్ ప్రచారం చేయడంలో టీఆర్ఎస్, బీజేపీలు దిట్ట. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు. ప్రజల గొంతు వినిపించాల్సిన ఛానల్స్ కొన్ని పార్టీలే నడిపించడం వల్లే ఈ అవాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇలాంటి ఛానల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని కోరారు. చదవండి: దుబ్బాక పోలింగ్: చేగుంటలో కలకలం -
'కార్మికులకు తొలుత రూ.1,000 పెంచుతాం'
తాండూరు (రంగారెడ్డి): మునిసిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు జీతాలు తొలుత రూ.1,000 పెంచుతామని రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. జీతాల పెంపు డిమాండ్‌తో గత నెలరోజులకు పైగా కార్మికులు సమ్మె చేస్తుండడంతో... మంగళవారం రంగారెడ్డి జిల్లా తాండూరు మునిసిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశం జరిగింది. దీనికి మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు తొలుత రూ.1,000 మేర జీతం పెంచుతామని, తర్వాత మరికొంత పెంచుతామని సమ్మె విరమించాలని కోరారు. కార్మికులకు ప్రస్తుతం రూ.8,300 జీతం వస్తుండగా... దాన్ని కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
'మాది పేదల సర్కార్'
నవాబుపేట (రంగారెడ్డి జిల్లా): 'మాది పేదల ప్రభుత్వం.. ప్రతి పేదవాడికీ న్యాయం జరుగుతుంది' అని రాష్ట్ర రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుబ్బడిపత్తేపూర్, గంగ్యాడ, ముబారక్పూర్, తిమ్మరెడ్డిపల్లి, పూలపల్లిలో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. అందుకు బృహత్తరమైన ప్రణాళికలతో ముందుకుపోతున్నారని స్పష్టంచేశారు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలలోపు రైతు రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాకు పెద్ద కంపెనీలు రాబోతున్నాయన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందని ఆయన తెలిపారు. 'బంగారు తెలంగాణ' కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోనే నవాబుపేట మండలం వెనకబడిన మండలమని.. అధిక నిధులు వెచ్చించి ఈ మండలాభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండుకు నిధులు మంజూరు చేసి ఉపయోగంలోకి తీసుక వస్తామన్నారు. బీటీ రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి బస్సులు వేస్తామని చెప్పారు. -
పట్టాల పంపిణీ
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీ ప్రకారం నిరు పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాబూర్‌లోని మున్సిపల్ గ్రౌండ్లో గాజుల రామారం పట్టాదారులకు మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది. -
108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
హైదరాబాద్: 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా జీవీకే యాజమాన్యం వారిపై దారుణంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం ఇందిరా పార్కు వద్ద 108 ఉద్యోగుల ధర్నాలో కోదండరాం మాట్లాడుతూ వీరి సమ్మెకు తెలంగాణ జేఏసీ మద్దతు ఇస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి జీవీకే యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. 108 ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, 108 ఉద్యోగుల వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. -
'మతిభ్రమించిన ... చంద్రబాబు'
విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శ సీనియర్లను బయటకు పంపిందే బాబు : మంత్రి మహేందర్‌రెడ్డి టీడీపీలో ఉన్నదంతా పిక్ పాకెట్ బ్యాచ్ : ఎంపీ బాల్క సుమన్ సాక్షి, హైదరాబాద్ : కనీవినీ ఎరుగని రీతిలో దిగ్విజయమైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బహిరంగ సభను చూశాక టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మతి భ్రమించిందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన వల్లే తెలంగాణలో మిగులు బడ్జెట్ సాధ్యమైందని ఆయన చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఓ అబద్దాన్ని పదే పదే చెబితే అది నిజమై పోదని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఆయన మరో మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్లతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్‌లో 14లక్షల మంది వలస పోయారని, ఆయన సీఎంగా వచ్చేంత వరకూ లేని రైతుల ఆత్మహత్యలు ఆయన సీఎం పీఠం ఎక్కగానే మొదలయ్యాయని, ఇదేనా ఆయన తెలంగాణకు చేసిన అభివృద్ధి అని నిలదీశారు. బషీర్‌బాగ్‌లో కాల్పులు, డ్వాక్రా, అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన సంఘటనలను తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలే దని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దగ్గర పనిచేశాడని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కేసీఆర్ ఒకరని, ఆయన టీడీపీ నుంచి పోటీ చేసిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ బి-ఫామ్‌పై పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ మహానాడును హైదరాబాద్‌లో ఎవరు పెట్టమని ఆయనను ఆహ్వానించారు. ఏపీలో పెడితే అక్కడి రైతులు ముల్లుగర్ర పట్టకుని తరుముతారు. డ్వాక్రా మహిళలు వెంటపడతారు అనే భయం ఉంది. అందుకే హైదరాబాద్‌ను ఎంచుకుండు’ అని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో రుణమాపీ జరగలేదని ఆంధ్రాబ్యాంకు సిఎండి చెప్పలేదా అని ప్రశ్నించారు. టీడీ పీ నుంచి సీనియర్ నేతలైన కేసీఆర్, ఇంద్రారెడ్డి తదితరులను బయటకు వెళ్లగొట్టింది చంద్రబాబే అని మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ బోధించిన రాజకీయ శిక్షణ తరగతులకు బాబు హాజరు కాలేదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు భరోసా కల్పించేలా అక్కడ ఉండకుండా, హైదరాబాద్‌లో కొత్త ఇల్లు ఎందుకు నిర్మించుకున్నట్లు అన్ని నిలదీశారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగై తదని, ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేయడానికి రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు చాలని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎలా ఆడుకోవాలో వాళ్లిధ్దరికీ బాగా తెలుసన్నారు. ఆ పార్టీలో అంతా పిక్పాకె ట్ బ్యాచ్, లూటీ బ్యాచ్ ఉందని విమర్శించారు. -
రేపు హనుమాన్ శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగరంలో శనివారం హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు సీటీ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శోభాయాత్ర సాగనుంది. గౌలిగూడ రామమందిర్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అయితే గౌలిగూడ నుంచి ప్రారంభమై రామకోటి, ఎక్స్ రోడ్, కాచిగూడ, వైఎమ్‌సీఏ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీనగర్, కవాడీగూడ, బాటా ఎక్స్‌రోడ్, రాంగోపాల్ పేట్ ల మీదుగా హనుమాన్ శోభాయత్ర సాగుతుందని కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. -
తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టులకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణలో 150 హోంగార్డుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నోటీఫికేషన్ జారీ చేసింది. హోంగార్డుల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 10 నుంచి 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సీటీ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆర్టీసీని త్వరగా విభజించండి: మహేందర్‌రెడ్డ్డి
కేంద్రానికి మంత్రి మహేందర్‌రెడ్డ్డి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: రోడ్డు రవాణా సంస్థను వీలైనంత త్వరగా విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్టు తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిం చారని పేర్కొన్నారు. కేంద్ర ఉపరిత రవాణాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రత సదస్సులో మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. 1998 మోటార్ వాహనాల చట్టం రద్దు చేస్తూ 2014 చట్టాన్ని తీసుకురావడంపై అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం ఆర్టీసీ, రవాణా సంస్థ బస్సులు, ట్యాక్స్‌లు, లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ వంటివన్నీ కేంద్రం ఆధీనంలోకి వెళితే రాష్ట్రాల ఉనికి కోల్పో తాయని, ఈ చట్టానికి టీ సర్కార్ వ్యతిరేకమని చెప్పినట్లు పేర్కొన్నారు. -
ప్రైవేటు చక్రాలకు బ్రేకులు!
నిబంధనలు ఉల్లంఘించి తిరిగే వాహనాలను నియంత్రించండి ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులకు మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పర్మిట్లు, అనుమతులతో సంబంధం లేకుండా స్టేజీ క్యారియర్లుగా తిరుగుతూ ఆర్టీసీ ఆదాయానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు వాహనాలను వెంటనే నియంత్రించాలని ఆదేశించింది. ఓవైపు ఆదాయానికి గండికొడుతూనే మరోవైపు ఓవర్ లోడ్‌తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నందున ఆ వాహనాల నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించింది. సీఎం ఆదేశం మేరకు రవా ణామంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం ఆర్టీసీ, రవాణా అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ప్రధాన పరిపాలన కార్యాలయం బస్‌భవన్‌లో జరిగిన భేటీలో రవాణా ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్, ఆర్టీసీ జేఎండీ రమణరావు, జేటీలు, ఈడీలు పాల్గొన్నారు. ప్రైవేటు వాహనాల ఆగడాలను నియంత్రించాలంటే నిర్దిష్టంగా ఏం చేయాలన్న సూచనలేవీ సమావేశంలో చర్చకు రాకపోవటం గమనార్హం. ముఖ్యంగా రవాణా అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. 439 మార్గాల్లో అక్రమ రవాణా తెలంగాణలో 3,597 మార్గాలుంటే వాటిల్లో 439 రూట్లలో ప్రైవేటు వాహనాలు అక్రమంగా తిరుగుతున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చా రు. వీటివల్ల ఆర్టీసీ ఏటా దాదాపు రూ.400 కోట్లకు పైగా ఆదాయం కోల్పోతోందని పేర్కొన్నారు. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోందన్నారు. దీంతో మంత్రి వెంటనే వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సీఎం పట్టుదల తో ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆర్ఎం, రవాణాశాఖ డీటీసీ స్థాయిలో ప్రతి మంగళవారం, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్లు నెలలో ఒకసారి సమావేశమై ఎప్పటికప్పుడు చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. తాను ప్రతి మూడు నెలలకోమారు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. ఇటీవల సీఎం మంజూరు చేసిన రూ.150 కోట్లతో కొత్త బస్సులు కొంటామన్నారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు 100 వరకు ఏసీ బస్సులు నడిచేలా చూస్తామన్నారు. ఖమ్మం, కరీంనగర్‌లకు 30 చొప్పున ఏసీ బస్సులు సమకూరుస్తామని పేర్కొన్నారు. చూపులకు అందంగా ఉండే రంగులతో కొత్త బస్సులు ఆకట్టుకుంటాయని, త్వరలో తెలంగాణ ఆర్టీసీకి కొత్త లోగో సిద్ధం చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లు శుభ్రంగా ఉండేలా చూడడంతోపాటు పరిసరాల్లో చెట్లు పెంచి ప్రయాణికులకు మంచినీటి వసతి మెరుగుపరచాలని ఆదేశించారు. ఆర్టీసీని విభ జన జరగాలి: టీఎంయూ తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి తదితరులు మంత్రిని కోరారు. ఆర్టీసీ వేతన సవరణ, ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్, డీఏ బకాయిల చెల్లింపు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆర్టీసీని పరిరక్షించేందుకు ప్రత్యేక పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ నేతలు రాజిరెడ్డి తదితరులు మంత్రిని కోరారు. -
వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తు
హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమీషనర్ మహీందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించామన్నారు. సోమవారం నాటి వినాయక నిమజ్జన కార్యక్రమానికి 30 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. నిమజ్జన దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. రేపటి నిమజ్జనంలో 15 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు.దీనికి పోలీసులకు ప్రజల సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో ఆర్టీసీ సేవలు భేష్: రామైరాం
బీహార్ రవాణా మంత్రి రామైరాం ప్రశంస సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజలకు ఆర్టీసీ మంచి సేవలు అందిస్తోందని బీహార్ రవాణాశాఖ మంత్రి రామైరాం ప్రశంసించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. బీహార్, తెలంగాణ రాష్ట్రాల రవాణా వ్యవస్థ, ఆర్టీసీల సేవలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా బీహార్ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ సేవలు బాగున్నాయన్నారు. బీహార్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నాలుగు వందలలోపు బస్సులే ఉన్నాయన్నారు. వాటిలో ఏసీ బస్సు ఒక్కటీ లేదన్నారు. తెలంగాణ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డిని బీహార్ పర్యటనకు ఆయన ఆహ్వానించారు. అందుకు మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. అంతకుముందు రాష్ట్రంలో రవాణా పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కొత్త రోడ్ల నిర్మాణాలతో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు కల్పించే ప్రణాళికలు వివరించారు. అభివృద్ధికి రవాణా కీలకంగా మారిన తరుణంలో ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా కమిషనర్ జగదీశ్వర్, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్టీసీ జేఎండీ రమణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ బదులు ఇక టీఎస్
* తెలంగాణ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ * 4 నెలల్లో పాత వాహనాల నంబర్లు మార్చుకోవాలి * రెండు మూడు రోజుల్లో కొత్త వాహనాలకు నంబర్లు తీసుకోవచ్చు * ప్రతి జిల్లాకో కోడ్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి * నంబర్లు కూడా మారతాయంటూ గందరగోళానికి తెరతీసిన మంత్రి * సిరీస్ సరే, నంబర్లు మారడమేమిటని తలపట్టుకుంటున్న వాహనదారులు * డబ్బుపెట్టి కొన్న ఫ్యాన్సీ నంబర్లను మారిస్తే ఎలాగంటూ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనాలు ఇక నుంచి ‘టీఎస్’తో మొదలుకానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాత వాహనాల నంబర్లను నాలుగు నెలల్లో మార్చుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్, ఆర్డర్ ఇస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త వాహనాలకు ‘టీఎస్’తో నంబరు తీసుకోవచ్చన్నారు. పాత వాహనాల నంబర్లను ముందుగా దరఖాస్తు చేసుకొని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల సమయం సరిపోకపోతే మరికొంత సమయం ఇస్తామన్నారు. పాత వాహనాలకు ‘ఏపీ’ బదులుగా ‘టీఎస్’తోపాటు నంబరు కూడా మారుతుందని చెప్పారు. వాహనదారులు అందుకోసం కొంత ఫీజు చెల్లించాలన్నారు. తెలంగాణ వచ్చినందుకు ఇది ప్రజలకు కానుకగా వేస్తున్న భారమా? అని విలేకరులు ప్రశ్నించగా... భారం వేయకుండా చూస్తామన్నారు. ప్రస్తుత నంబరును యథావిధిగా ఉంచి, ‘ఏపీ’ స్థానే ‘టీఎస్’ను వాహనదారులే మార్చుకునే వెసులుబాటు చేయవచ్చు కదా? అని అడగ్గా అలా చేయడం సాధ్యం కాదన్నారు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వీటిపై ఇంకా కసరత్తు చేస్తున్నామన్నారు. ఆటోల ట్యాక్స్‌లను ఎత్తివేస్తున్నామన్నారు. తెలంగాణలో 73 లక్షల వాహనాలు తిరుగుతున్నాయనీ... అందులో 50 లక్షలు ద్విచక్ర వాహనాలేనన్నారు. విధి విధానాలు ఖరారయ్యాకే రిజిస్ట్రేషన్లు తెలంగాణ రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేంద్రం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో మారో నాలుగైదు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంతో ఏ జిల్లాకు ఏ నంబర్ కేటాయించాలనే విషయంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా అక్షర క్రమం ఆధారంగా వీటి కేటాయింపు ఉంటుంది. అదే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు 01 కోడ్ కేటాయింపుతో ఇది మొదలుకానుంది. అయితే ఈ కేటాయింపు ఎలా ఉండాలనే విషయంలో గురు, శుక్రవారాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా, వీటిని విభజించి ఆ సంఖ్యను 24కు పెంచాలనే ఆలోచన కూడా ఉంది. అక్షర క్రమం ప్రకారం కేటాయిస్తే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మళ్లీ గందరగోళం తలెత్తుతుంది. అలాంటప్పుడు అక్షరక్రమం కాకుండా సాధారణంగా నెంబర్లు కేటాయించాలా, లేదా ముందస్తుగా కొన్ని బఫర్ నెంబర్లు గుర్తించి బ్లాక్ చేసి పెట్టడమా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కోడ్ నెంబర్ల వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నందున ఈ కసరత్తును వీలైనంత తొందరలో పూర్తి చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నంబర్ల మార్పంటూ గందరగోళం తెలంగాణ రాష్ర్టంలోని వాహనాలకు టీఎస్ సిరీస్ కేటాయించడాన్ని వాహనదారులు స్వాగతిస్తున్నా.. నంబర్లు కూడా మారుతాయంటూ మంత్రి గందరగోళానికి తెరలేపారంటూ వాహనదారులంటున్నారు. సిరీస్ మార్పు సరే నంబర్లు ఎందుకు మార్చాలని ప్రశ్నిస్తున్నారు. అలా మారితే, డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్ల పరిస్థితి ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్లు తమకే దక్కుతాయా? లేక మళ్లీ కొనుక్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతుందా? అన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. -
అయితే ఊటీ... కాదంటే ఢిల్లీ!
* కొనసాగుతున్న ‘స్థానిక’ క్యాంపు రాజకీయాలు * గోవా నుంచి తిరిగొచ్చిన రంగారెడ్డి కాంగ్రెస్ జెడ్పీటీసీలు సాక్షి, హైదరాబాద్ : జిల్లా పరిషత్, మునిసిపల్ చైర్మన్ల ఎన్నికల క్యాంపు రాజకీయం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు కావొస్తున్నా అప్పటినుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వివిధ రాజకీయ పార్టీలు క్యాంపులు నిర్వహిస్తూనే ఉన్నాయి. సమ్మర్ క్యాంపు పేరిట ఊటీ, కొడెకైనాల్, గోవా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో మకాం వేశాయి. క్యాంపు నిర్వహణ ఖర్చు తడిసి మోపెడవుతున్నా చైర్మన్ పీఠం కళ్లముందు కనిపిస్తుండడంతో ఎంతైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేతులెత్తేశాయి. ఫలితాలు వచ్చిన వారం, పదిరోజులపాటు శిబిరాలు నిర్వహించిన కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్ ధాటికి తట్టుకోలేక శిబిరాలు మూసేశాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 జెడ్పీటీసీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావించింది. జెడ్పీ చైర్మన్ రేసులో ఉన్న ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులందరినీ సమ్మర్ క్యాంపు పేరిట గోవాకు తీసుకెళ్లారు. అయితే నాటినుంచి క్యాంపు నిర్వహణ తడిసి మోపెడుకావడం, అదే సమయంలో జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో జెడ్పీ చైర్మన్ పదవిపై కాంగ్రెస్ ఆశలు వదులుకని గోవా శిబిరం ఎత్తివేసింది. దీంతో జెడ్పీటీసీలంతా జిల్లాకు తిరుగుముఖం పట్టారు. జిల్లాలో 12 జెడ్పీటీసీలు దక్కించుకున్న టీఆర్ఎస్ ఎలాగైనా జెడ్పీని దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. కాంగ్రెస్ జెడ్పీటీసీలకు డబ్బు, పదవులతోపాటు ఇతరత్రా కానుకలిస్తామని ఎరవేస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం క్యాంపు రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. -
టీడీపీకి ఎదురు దెబ్బ
టీఆర్ఎస్లోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కేసీఆర్‌తో మహేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం, నరేందర్‌రెడ్డి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజీనామాలు చేసి టీఆర్ఎస్లో చేరగా.. ఇటీవలే బోథ్‌కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సైతం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, కె.ఎస్.రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం సహచరులతో కలసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరికకు కేసీఆర్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్‌తో కలసి పనిచేస్తామని ఆ ముగ్గురు నేతలు ప్రకటించారు. న్యాయం జరగదనే: కేసీఆర్‌తో భేటీ అనంతరం ఈ ముగ్గురూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా కేసీఆర్‌ను కలిశాం. త్వరలోనే కార్యకర్తలతో కలసి టీఆర్ఎస్లో చేరతాం. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఆంధ్ర నాయకత్వంతో, ఆ ప్రాంత నేతలతో తెలంగాణకు న్యాయం జరుగదు. ఆ ప్రాంత పార్టీలకు ఇక్కడ చోటులేదు’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనమైతే ఏంచేస్తారన్న ప్రశ్నకు..‘‘విలీనం మాకు ముఖ్యం కాదు. ఎక్కడ ఉన్నా గెలవగలిగే సత్తా ఉంది’’ అని బదులిచ్చారు. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని, వారి రాకతో రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని టీఆర్ఎస్ నేత కె.తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్: కేటీఆర్ కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై స్పష్టత ఇవ్వకుండానే ఇకపై తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించటం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై అడిగిన ప్రశ్నకు ‘‘పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక పార్టీ విలీనం ఉంటుందని కానీ, ఉండదని కానీ చెప్పామా?’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘ఇకపై టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి’’ అని అభివర్ణించారు. పార్టీలో చర్చించాకే విలీనం, పొత్తు అంశాలపై నిర్ణయిస్తామన్నారు. చంద్రబాబుకు షాక్ సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, తాండూరు ఎమ్మెల్యే పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ, పరిగి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పట్నం నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం నిష్ర్కమణతో తెలుగుదేశం పార్టీకి రంగారెడ్డి జిల్లాలో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో టీడీపీనినమ్ముకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో పాటు అధినేత అనుసరిస్తున్న వైఖరి వల్లనే వీరు పార్టీని వీడినట్లు సమాచారం. స్వయంగా చంద్రబాబే జిల్లాల్లో గ్రూపులు ప్రోత్సహించటం కూడా వీరి రాజీనామాకు కారణంగా తెలిసింది. ఇదే బాటలో మరికొందరు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. గేట్లు ఎత్తివేస్తే తమ పార్టీలోకి వరదలా నాయకులు ఇతర పార్టీల నుంచి వెల్లువెత్తుతారని, చాలామంది మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారని టీడీపీ నేతలు, ముఖ్యంగా అధినేత చంద్రబాబు ప్రచారం చేస్తున్న దశలో దాన్ని పటాపంచలు చేస్తూ ముఖ్య నేతలు ముగ్గురు పార్టీని వీడటం టీడీపీకి మింగుడుపడటం లేదు. రంగారెడ్డి జిల్లాలో పార్టీ తరపున 2009లో అయిదుగురు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి సుమారు రెండు సంవత్సరాల కిందట పార్టీని వీడారు. తాజాగా మహేందర్‌రెడ్డి, రత్నం అదే బాటలో నడిచారు. ప్రస్తుతం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టి. ప్రకాష్ గౌడ్ మాత్రమే పార్టీలో ఉన్నారు. -
వచ్చేది వేసవికాలం
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కాలమేదైనా కన్నీటి కష్టాలు తప్పవు. గతేడాది కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పటివరకు అధికారులు నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోలేదు. రెండు నెలల్లో వేసవి సమీపిస్తోంది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య ఉంది. మంత్రి ప్రకటించినట్టుగా కొన్నిచోట్ల నల్లాలు తొలగిం చారు. కొన్నిచోట్ల తొలగించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాగా, కొత్త కనెక్షన్ కోసం రూ.200 చెల్లించినా వేలాది మందికి నల్లా కనెక్షన్ ఇవ్వలేదు. కేవలం భైంసా పట్టణంలోనే 300 మందికిపైగా కొత్త నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వేలాది మంది దరఖాస్తు చేసుకుని కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మాత్రం పైప్‌లైన్ నిర్మాణాలు సక్రమంగా లేవని, సాంకేతిక కారణాలతో కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదంటున్నారు. ప్రచారం కరువు నీటివృథా అరికట్టడం, నీటి సరఫరా విస్తరణ కోసం పబ్లిక్ నల్లాలు తొలగించి, వాటి స్థానంలో ఇంటికో నల్లా కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రజలకు అవగాహన కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. పబ్లిక్ నల్లాలు అధికంగా ఉన్న వాడల్లో శిబిరాలు ఏర్పాటు చేయాలి. అక్కడే నల్లా కనెక్షన్ దరఖాస్తుఫారాలు తీసుకుని, రూ.200లకే నల్లా కనెక్షన్ మంజూరు చేయాలి. ఇది చాలాచోట్ల జరగలేదు. కానీ, బల్దియాల్లో పబ్లిక్ నల్లాలను మాత్రం చాలావరకు తొలగించారు. ఇదిలాఉండగా, గులాబీ కార్డుదారులకు కొత్త కనెక్షన్ కోసం ఒక్కో మున్సిపాలిటీలో రూ.3,600 నుంచి రూ.7,200 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో గులాబీ కార్డుదారులూ పబ్లిక్ కుళాయిలపైనే ఆధారపడుతున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో బడానాయకులు ఇంట్లో ఓ నల్లా ఉన్నా ఎక్కువ నీటి కోసం తమ పలుకుబడితో పబ్లిక్ కుళాయిలు తొలగింపుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైప్లైన్లు లేక.. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని అశోక్‌నగర్, గంగారాంనగర్, కొత్తబస్టాండ్ ఏరియా, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, సుబ్బరావుపల్లె తదితర ప్రాంతాల్లో పైప్లైన్లు ఉన్నా అధికారులు నల్లా కనెక్షన్లు ఇవ్వడం లేదు. కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని ఆర్‌ఆర్‌వో కాలని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియా, త్రినేత్ర శివాలయం ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణమే జరగలేదు. దీంతో ప్రజలు ఏటా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని సుమారు ఏడు శివారు ప్రాంతాల్లో పైప్‌లైన్ నిర్మాణం లేదు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్ కొత్త కాలని, 345- ఇందిరమ్మ కాలని, తిలక్‌నగర్, వడ్డెరకాలని(కొంత ప్రాంతం) పలు శివారు కాలనిల్లో తాగునీటి సరఫరా చేసేందుకు మూడేళ్ల క్రితమే పైప్లైన్లు వేశారు. కానీ వెంటనే కనెక్షన్లు ఇవ్వలేదు. అవి పగిలిపోయాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ట్యాంకర్లనే ఆశ్రయిస్తున్నారు. పైప్లైన్లు లేకపోవడంతోనే.. మంగతాయారు, కమిషనర్, బెల్లంపల్లి మున్సిపాలిటీ. పబ్లిక్ నల్లాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిరుపేదలకు రూ. 200లకే ఇంటికో నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ, పలు చోట్ల పైప్‌లైన్ నిర్మాణం పూర్తికాక, సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం. పనులు పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్లు ఇస్తాం. అలాగే చాలా మంది కొత్త నల్లా కనెక్షన్ కోసం సమర్పించిన దరఖాస్తులో వివరాలు సరిగా లేవు. అసంపూర్తి దరఖాస్తులున్న వారికి కనెక్షన్లు ఇవ్వం.