
పంపలో మహిళలు స్నానాలు చేయొద్దు
శబరిమల: శబరిమలలోని పంపా నదిలో బుధవారం అయ్యప్పస్వామి పుణ్యస్నానం(ఆరట్టు కడవు) ఉత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ ఒక్క రోజు మాత్రం మహిళలు నదీస్నానం ఆచరించవద్దని ఆలయ కమిటీ నిర్ణయించింది. నైష్టిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప నదిలో పుణ్యస్నానం చేస్తున్నపుడు మహిళలు ‘ఆరట్టు కడవు’లో పాల్గొనకూడదనే నియమం దశాబ్దాలుగా ఉందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) స్పష్టంచేసింది.
మిగతా రోజుల్లో పంపా నదిలో మహిళలు పుణ్యస్నానాలు చేసే వెసులుబాటు ఉంది. వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ‘ఆరట్టు’ రోజున సైతం మహిళలు వస్తున్నారని, అందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని టీడీబీ పేర్కొంది.