సాయం చేసిన సైనా | saina helps for crpf families | Sakshi
Sakshi News home page

సాయం చేసిన సైనా

Published Fri, Mar 17 2017 5:35 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

సాయం చేసిన సైనా

సాయం చేసిన సైనా

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో గత వారం జరిగిన పేలుడులో మరణించిన  సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ రూ.6 లక్షల సాయం ప్రకటించారు. చనిపోయిన 12మంది జవాన్ల కుటుంబాలకు రూ.50వేల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం తన 27వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటన తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. పెద్ద దిక్కు కోల్పోయిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు తన చేతనైనంత సాయం చేస్తున్నానని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ కూడా రూ.1.08 కోట్లను జవాన్ల కుటుంబాలకు సాయంగా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.9 లక్షలు అందజేయనున్నట్లు గురువారం తెలిపారు. 219 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్లు సుక్మా జిల్లా బెజ్జిలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement