రెండేళ్లలో రూ.25 కోట్లు
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో సైనా నెహ్వాల్ సాధించిన విజయాలతో తన బ్రాండ్ విలువ పెరిగింది. సైనా పేరుతో రెండేళ్ల కాలంలో రూ.25 కోట్ల వ్యాపారం చేయొచ్చని ప్రముఖ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐఓఎస్ భావిస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్‌తో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సైనాకు ఎంత మొత్తం చెల్లిస్తారనేది వెల్లడికాలేదు. ఇకనుంచి సైనా ఎండార్స్‌మెంట్, పేటెంట్స్, డిజిటల్ రైట్స్, చిత్రాలు, సామాజిక మాధ్యమాల్లో కనిపించే విషయాలన్నింటినీ ఐఓఎస్ స్పోర్ట్స్ పర్యవేక్షిస్తుంది. క్రికెటర్ రైనా, బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీ కోమ్, రెజ్లర్ సుశీల్ కుమార్‌ల మార్కెటింగ్ వ్యవహారాలనుకూడా ఐఓఎస్ స్పోర్ట్స్ చూస్తోంది.
మళ్లీ నంబర్‌వన్‌గా సైనా
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) గురువారం ప్రకటించిన అంతర్జాతీయ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ను వెనక్కి నెట్టిన సైనా 82,792 పాయింట్లతో అగ్రస్థానాన్ని అందుకుంది. పీవీ సింధు 14వ స్థానంలో ఉంది. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని రెండు స్థానాలు మెరుగుపరుచుకుని పదో ర్యాంక్‌కు చేరారు. ఇక పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్‌లో.. కె.శ్రీకాంత్ ఒక స్థానం దిగజారి నాలుగో ర్యాంక్‌లో నిలిచారు.