సంజయ్ దత్ పెరోల్ తిరస్కరణ
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. గడువు పొడిగించాలంటూ సంజయ్ కోరగా మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు తిరస్కరించింది. ఆయనకు మంజూరుచేసిన 14 రోజుల పెరోల్ ఈ నెల7 తో ముగిసిన విషయం తెలిసిందే.
1993 నాటి ముంబై వరుస పేలుల్ల అనంతరం ఏకే 56 రైఫిల్ను కలిగి ఉండటం, దాన్ని చట్టవిరుద్ధంగా నాశనం చేయడంతో జైలుశిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్.. ఇటీవలే.. డిసెంబర్ 24వ తేదీన 14 రోజుల పెరోల్ సెలవుపై బయటకు వచ్చారు. కానీ అదనపు సెలవు మంజూరు కాకపోవడంతో సంజూబాబా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.