జల్లికట్టును అనుమతించేది లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: జల్లికట్టుకు అనుమతి ఇచ్చేది లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. తాము ఇచ్చిన స్టే ఎత్తివేసేందుకు నిరాకరించింది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జస్టిస్ దీపక్ మిశ్రా, ఎన్వీ రమణలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం స్టే విధించింది.
కనీసం మూడు రోజులైనా జలికట్టుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో జల్లికట్టును అనుమతించాలని కోర్టుకు పిటిషనర్ మొరపెట్టుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల్లికట్టును అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తమ రాష్ట్రంలో అత్యంత పురాతన క్రీడ అయిన జల్లికట్టును ఆర్డినెన్సు తెచ్చైనా అనుమతించాలని తమిళనాడు అధికార, విపక్ష నాయకులు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు.