స్టార్ హీరోకు లిఫ్ట్‌ ఇచ్చిన సీఎం | Shah Rukh Khan and Mamata Banerjee travel in same car | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోకు లిఫ్ట్‌ ఇచ్చిన సీఎం

Published Fri, Nov 17 2017 1:38 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Shah Rukh Khan and Mamata Banerjee travel in same car - Sakshi - Sakshi

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద మనసు ముందు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు తాను ప్రయాణించిన కారు చిన్నదిగా అనిపించి ఉండదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సీఎం మమత, షారుఖ్‌లు శాంట్రో కారులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మమతా బెనర్జీ శాంట్రో కారులో ఆమెతో పాటు షారుఖ్ ఎయిర్ పోర్టుకు రావడంతో అక్కడున్న వారు షాక్ తిన్నారు.

ఎయిర్‌పోర్టుకు చేరిన వెంటనే కారు దిగిన స్టార్ హీరో షారుఖ్ సీఎం మమత కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయారు. ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న కొందరు.. 'షారుఖ్ మీరు చివరగా ఇంత చిన్న కారులో ఎప్పుడు ప్రయాణించారో గుర్తుందా' అని ప్రశ్నించారు. హీరో మాత్రం ఏ విధంగానూ స్పందించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రతాప్ బోస్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది.

ఎయిర్‌పోర్టుకు ఆలస్యం అవుతుందన్న కారణంగా షారుఖ్‌కు ఏంతో గొప్ప మనసుతో సీఎం మమత లిఫ్ట్‌ ఇచ్చారని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఎంతో గొప్ప మనస్సున్న సీఎం మమతా బెనర్జీ అని, అదే విధంగా మహిళా సీఎం కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న షారుఖ్‌కు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో తెలుసునంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement