అభిమానులను హెచ్చరించిన బాలీవుడ్ బాద్షా
ముంబయి : సోషల్ మీడియాలో హీరోలు, హీరోయిన్లు, సహోద్యోగులు, మిత్రులు ఇలా ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా బాధపడేలా, అసభ్యకరంగా పోస్ట్ చేస్తే.. అలాంటి వారు నా అభిమానులే కాదంటూ బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఓ హీరో అభిమాని ఇతర హీరోల మూవీలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇకనైనా మానుకోవాలని అభిమానులకు సూచించాడు. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుక్ల మధ్య గతంలో విభేదాలు ఉన్న విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మందికి విదితమే. ప్రస్తుతం వారిద్దరూ ఒకరి మూవీ ప్రమోషన్లలో ఇంకొకరు పాల్గొంటూ హ్యాపీగా ఉన్నప్పటికీ, కొందరు ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై షారుక్ పరోక్షంగా ట్విట్టర్ ద్వారా మండిపడ్డాడు.
ఇతర నటీనటుల మూవీలపై అనవసర కామెంట్లు చేయవద్దని షారుక్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియా మన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు పూర్తిగా స్వాతంత్ర్యం ఇచ్చింది, దాన్ని దుర్వినియోగం చేయవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. సమాజంలో ఎలా ప్రవర్తించాలో తాను నేర్పడంలేదని, కొందరు ఇడియట్స్తో తాను వ్యంగ్యంగా వ్యవహరిస్తానన్నాడు. గతంలో సల్మాన్ఖాన్ ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్, రిషి కపూర్, తదితరులు ఆన్లైన్ విమర్శలు, కామెంట్లపై అభిమానులను హెచ్చరించిన విషయం విదితమే.
On social media u do/say wot u feel,free expression blah blah,But wil request my ppl not 2 deride or abuse other films & colleagues.Not cool
— Shah Rukh Khan (@iamsrk) October 4, 2015
But ur lyf ur rulz. Am not here to 2 teach manners. But I deal with idiots with sarcasm. Madar Behen users r low on vocabulary & status.
— Shah Rukh Khan (@iamsrk) October 4, 2015