వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా, వీళ్లు బహిరంగంగా..
ముంబై: పేదరికం, నిరక్షరాస్యతను మత మార్పిళ్లకు సాధనంగా వాడుకుంటున్నారని శివ సేన మండిపడింది. మత మార్పిళ్ల నిరోధానికి పటిష్టమైన చట్టం కావాలని బుధవారం తన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. గతంలో క్రై స్తవ మిషనరీలు, ముస్లిం పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా మత మార్పిళ్లు చేశారని తెలిపింది. ఇప్పుడు హిందూ సంస్థలు బహిరంగంగా చేస్తున్నాయని పేర్కొంది.
హిందూ సంస్థలు ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు ముస్లింలు, క్రైస్తవులను హిందూ మతంలోకి మారుస్తున్న విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) 'ఘర్ వాపసీ' (తిరిగి మతం మారడం) కార్యక్రమం ద్వారా గతంలో మతం మారినవారిని హిందూ మతంలోకి మారుస్తోంది.