religious conversions
-
బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమే, కానీ..
న్యూఢిల్లీ: బలవంతంగా మతం మార్చడం ముమ్మాటికీ తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు మరోసారి తేల్చిచెప్పింది. బలవంతపు మత మార్పిడి రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. భారతదేశంలో నివస్తున్న వారంతా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. అయితే, సమాజానికి సేవ చేయడం కోసం మరో మతంలోకి వెళితే అది బలవంతపు మత మార్పిడి కాదని పేర్కొంది. అలాంటి కేసులకు గతంలో తీర్పులు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించింది. అలాగే.. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగే మత మార్పిడులను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మత మార్పిడుల వ్యవహారంపై రాష్ట్రాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. బలవంతపు మత మార్పిడులు దేశ భద్రతకు ప్రమాదకరం కావొచ్చని సుప్రీంకోర్టు గతంలో వెల్లడించింది. అంతేకాకుండా పౌరుల మత స్వేచ్ఛకు కూడా ప్రతిబంధకమేనని పేర్కొంది. ఇలాంటి మత మార్పిడులను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇదీ చదవండి: మూన్‌లైటింగ్‌పై సీజేఐ సంచలన వ్యాఖ్యలు -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
బలవంతపు మతమార్పిళ్లు... దేశభద్రతకే పెనుసవాలు!
న్యూఢిల్లీ: బలవంతపు మతమార్పిడులను అత్యంత తీవ్రమైన అంశంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. మోసగించి, ప్రలోభపెట్టి, భయపెట్టి మతాంతరీకరణ చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేసింది. ‘‘మత స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ ఎవరికీ లేదు! ఈ తరహా మార్పిడులను అడ్డుకోని పక్షంలో చాలా సమస్యాత్మక పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పోకడలు నిజమే అయితే గనక అంతిమంగా ఇది దేశభద్రతకే పెను సవాలు విసరగలిగినంతటి తీవ్రమైన సమస్య! అంతేగాక పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కూడా ప్రమాదంలో పడేస్తుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకోండి. బలవంతపు మతమార్పిళ్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోండి. ఆ వివరాలతో 22లోగా అఫిడవిట్ దాఖలు చేయండి’’ అని ఆదేశించింది. బలవంతపు మత మార్పిళ్లను అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అడ్వకేట్ అశ్వనీకుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. బలవంతపు మతమార్పిడులను అడ్డుకునేందుకు కేంద్రం ఏం చేయనుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. ఈ అంశాన్ని రాజ్యాంగ పరిషత్తులో చర్చించినట్టు ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘డబ్బు తదితర ప్రలోభాలు చూపి, భయపెట్టి, మోసగించి మతం మార్చడాన్ని అడ్డుకునేందుకు ఒడిశా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తెచ్చిన రెండు చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ అంశం గతంలో సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ చట్టాల చెల్లుబాటును సమర్థించింది కూడా’’ అని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఈ బలవంతపు మతమార్పిళ్లు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయన్నారు. ‘‘తాము క్రిమినల్ నేరాల్లో భాగస్వాములుగా మారుతున్నామన్న వాస్తవం కూడా ఇలాంటి బాధితులకు చాలాసార్లు తెలియదు. పైగా మతం మారుస్తున్న వాళ్లు తమకు సాయం చేస్తున్నారని భ్రమిస్తుంటారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. విచారణను నవంబర్ 28కి ధర్మాసనం వాయిదా వేసింది. -
మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్
బెంగళూరు: మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం. బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయొద్దంటూ కర్ణాటక గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ ఆలోచన చాలా బాధాకరమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ను అసెంబ్లీలో క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. -
మతమార్పిడులపై హైకోర్టు సీరియస్
బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు మండిపడింది. దీనిపై వెంటనే సమగ్రంగా విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తన ముందుకు వచ్చిన రెండు కేసుల విషయంల కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనల్లో డీజీపీ స్వయంగా విచారణను పర్యవేక్షించి, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలిపింది. 24 ఏళ్ల వయసున్న హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, ఆమెకు ఓ ముస్లిం వ్యక్తితో 2016 డిసెంబర్ నెలలో చేసిన పెళ్లి చెల్లుబాటు కాదని చెబుతూ, ఇలాంటి విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలని డీజీపీని ఆదేశించింది. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న సంస్థల పాత్రపై విచారణ జరపాలని, మొత్తం రాష్ట్రమంతా డీజీపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయన వీటిని పర్యవేక్షించాలని జస్టిస్ కె. సురేంద్రమోహన, జస్టిస్ అబ్రహం మాథ్యూలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లవ్ జీహాద్, మతమార్పిడుల కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలే ఉండటం దారుణమని వ్యాఖ్యానించింది. ముందుగా హిందూ యువతులను ప్రేమలోకి దించి తర్వాత వారిని బలవంతంగా మతమార్పిడి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చి అప్పుడు వారిని పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జీహాద్ అంటున్నారు. కేరళలో ఇందుకోసం ఏకంగా కొన్ని సంస్థలే ఏర్పాటయ్యాయి. తన కూతురిని కొన్ని సంస్థలు బలవంతంగా మతం మార్పించి, ఒక ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తున్నాయని ఓ యువతి తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను బలవంతంగా సిరియా పంపి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను మేజర్‌నని, తన ఇష్టం మేరకే మతం మారి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో చెప్పినా, కోర్టు మాత్రం ఆ వివాహాన్ని చట్టపరంగా రద్దుచేసి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించింది. హోమియోపతి వైద్యవిద్య చదువుతున్న 24 ఏళ్ల యువతి అన్నీ వదిలిపెట్టి ఉన్నట్టుండి మతం మారి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని, దాని వెనక కొంతమంది బలవంతం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
చర్చిలో సీఎం యోగి సేన హల్చల్
భందోహి: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహినికి చెందిన కొందరు.. శుక్రవారం ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరం ఎదుట ఆందోళనకు దిగారు. సంత్ రవిదాస్ నగర్ జిల్లా ఔరాయి తాలూకా తియూరి గ్రామంలోని ఓ ఇంటిలో చర్చి నిర్వహిస్తుండగా, యువవాహిని కార్యకర్తలు అడ్డుకున్నారు. దళితులను బలవంతంగా మతం మార్పిస్తున్నారనేది యువవాహిని ఆరోపణ. విషయం తెలుసుకున్న వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు.. చర్చి పాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన ఆ పాస్టర్‌ను అజ్మన్ అబ్రహామ్‌గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తియూరి గ్రామంలోని ఆ చర్చిలో కొన్నాళ్లుగా మతమార్పిడులు జరుగుతున్న సంగతి ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని, అందుకే తామే చర్చికి వెళ్లి ఆందోళన చేయాల్సివచ్చిందని యువవాహిని జిల్లా అధ్యక్షుడు సుభాష్ శర్మ మీడియాకు చెప్పారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌వో ఓంకార్ సింగ్ యాదవ్ తెలిపారు. కాగా, యోగి సీఎం అయిన తర్వాత హిందూ యువవాహిని కార్యకర్తలు చర్చిల ముందు ఆందోళన నిర్వహించడం ఇది రెండోసారి. గత నెలలో మహారాజ్‌గంజ్‌లోని ఓ చర్చి వద్ద ప్రార్థనలను చేసుకుంటున్న 150 మందిని చెదరగొట్టారు. ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగానే, నేడు అలాంటిదే మరో కేసు నమోదుకావడం గమనార్హం. -
పాస్టర్ కుమారుడిని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు
మావోయిస్టులు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఓ చర్చి పాస్టర్ కుమారుడిని కిడ్నాప్ చేశారు. ఫాదర్ కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న ఊకే కన్నయ్య ఇంటికి శుక్రవారం అర్ధరాత్రి సుమారు వంద మంది సాయుధ మావోయిస్టులు వచ్చారు. ఇంటి తలుపులు ఆయుధాలతో పగులగొట్టి కొందరు లోపలికి ప్రవేశించారు. అక్కడ నిద్రిస్తున్న యువకులను నిద్ర లేపి.. పాస్టర్ కన్నయ్య ఎవరని ప్రశ్నించారు. కన్నయ్య దేవుని సువార్త చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా ప్రాంతానికి వెళ్లారని వారు చెప్పారు. మావోయిస్టుల్లో ఒకరు ఓ యువకుడిని కన్నయ్య పెద్ద కుమారుడు ఇస్సాకు అని గుర్తించారు. ఇస్సాకు కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టి వెంట తీసుకువెళ్లారు. అడ్డుకోబోయిన కుటుంబసభ్యులను పక్కకు నెట్టి, కన్నయ్యను తమ వద్దకు రమ్మని చెప్పాలని హెచ్చరించారు. ఈ ఘటనతో లక్ష్మీపురం గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కన్నయ్య అలియాస్ ఏలియా 13 ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని మైత ప్రాంతం నుంచి లక్ష్మీపురం వలస వచ్చి, న్యూ బెతస్త ట్రైబల్ మినిస్ట్రీని స్థాపించారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 52 చర్చిలు ఏర్పాటు చేసి గిరిజనులకు క్రీస్తు బోధనలు చేస్తున్నారు. గిరిజనుల మత మార్పిడులపై మావోయిస్టులు పలుమార్లు కనకయ్యను హెచ్చరించారు. గత ఏడాది కూడా కనకయ్యను అపహరించడానికి ఇంటికి వచ్చినట్లు సమాచారం. అప్పట్లో కనక్క మావోయిస్టులకు దొరక కుండా తప్పించుకుని పారిపోయారు. దీంతో మరో సారి మావోయిస్టులు కనకయ్యను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో కుమారుడిని పట్టుకుపోయారని కుటుంబసభ్యులు చెపుతున్నారు. కాగా మతమార్పిడుల కారణంగానే కన్నయ్యపై మావోయిస్టులు ఆగ్రహంతో ఉన్నారని తెలిసిందని పోలీసులు కూడా చెపుతున్నారు. -
వాళ్లు గుట్టుచప్పుడు కాకుండా, వీళ్లు బహిరంగంగా..
ముంబై: పేదరికం, నిరక్షరాస్యతను మత మార్పిళ్లకు సాధనంగా వాడుకుంటున్నారని శివ సేన మండిపడింది. మత మార్పిళ్ల నిరోధానికి పటిష్టమైన చట్టం కావాలని బుధవారం తన అధికార పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది. గతంలో క్రై స్తవ మిషనరీలు, ముస్లిం పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా మత మార్పిళ్లు చేశారని తెలిపింది. ఇప్పుడు హిందూ సంస్థలు బహిరంగంగా చేస్తున్నాయని పేర్కొంది. హిందూ సంస్థలు ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు ముస్లింలు, క్రైస్తవులను హిందూ మతంలోకి మారుస్తున్న విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) 'ఘర్ వాపసీ' (తిరిగి మతం మారడం) కార్యక్రమం ద్వారా గతంలో మతం మారినవారిని హిందూ మతంలోకి మారుస్తోంది. -
ప్రధాని ప్రకటన చేయాల్సిందే
మతమార్పిళ్లపై రాజ్యసభలో పట్టువీడని విపక్షం వీహెచ్ ఒకరోజు సస్పెన్షన్ సాక్షి, న్యూఢిల్లీ: మత మార్పిళ్లు న్యాయబద్ధమేనని ప్రభుత్వం అంటున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీయే ఈ విషయమై రాజ్యసభలో ప్రకటన చేయాలన్న విపక్షాలు పట్టువీడలేదు. మూడో రోజూ ఈ విషయమై సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. బుధవారం కాంగ్రెస్ సహా పలు పార్టీల సభ్యుల ఆందోళన కారణంగా సభ పలుమార్లు వాయిదాపడింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని, ప్రధాని వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. మతమార్పిళ్లపై దేశమంతటా ఆందోళన వ్యక్తమవుతుండగా ప్రధాని మాత్రం స్పందించడం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ప్రధానమంత్రి, ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెనన్, కాంగ్రెస్ నేత అశ్వినీకుమార్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార బీజేపీ ఎంపీలు మతమార్పిళ్లపై చేస్తున్న వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని జోక్యం చేసుకుని ప్రకటన చేయాలని కోరారు. అయితే, కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు ఇదే డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభాపతి స్థానంలో ఉన్నారు. ఈ సందర్భంలో ‘ప్రైం మినిస్టర్ కో బులావో’ అంటూ ఏకవచనంలో సంబోధించారని, అన్ పార్లమెంటరీ భాష వాడారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో చైర్మన్ నిబంధన 255 కింద వీహెచ్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నిబంధన కింద చైర్మన్ సభ్యుడి పేరు చదివినప్పుడు ఆ రోజులో తదుపరి సమయం సభకు హాజరు కాకూడదు. ‘గుడ్‌గవర్నెన్స్’పై దద్దరిల్లిన లోక్‌సభ క్రిస్మస్ పండుగ రోజున పాఠశాలలను తెరిచి ఉంచాలనే ప్రభుత్వ ఉత్తర్వులపై లోక్‌సభలో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టిస్తోందని, సంఘ పరివార్ ఎజెండాను అమలు చేయాలని చూస్తోందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. 25న గుడ్గవర్నెన్స్పై వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఆ మేరకు వాటి వీడియోలు తీసి పంపాలని తెలుపుతూ వెలువడిన ఉత్తర్వులను కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ సభలో చదివి వినిపించారు. ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధాన మిచ్చారు. క్రిస్మస్ సెలవు విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవటం లేదన్నారు. -
మతమార్పిడుల అంశంపై అట్టుడికిన లోక్‌సభ!
న్యూఢిల్లీ: మతమార్పిడుల అంశంపై ఈరోజు లోక్‌సభ అట్టుడికింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పలు పార్టీలు వాకౌట్ చేశాయి. ఆగ్రాలో మతమార్పిడుల అంశంపై సభలో సభ్యులు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో ఉద్రికతతలు లేవన్న మూలాయం సింగ్ యాదవ్ మాటలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. మత మార్పిడులు తీవ్రమైన అంశమని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో ఒక పార్టీని నిందించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. అధికారులతో కేంద్ర హొం శాఖ సమావేశమైనట్లు తెలిపారు. ఆగ్రా మతమార్పిడుల అంశంపై యుపి ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు, వారి విశ్వాసాల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నందుకు గర్విస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ స్సందనపై పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీల సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. **