మతమార్పిడుల అంశంపై అట్టుడికిన లోక్సభ!
న్యూఢిల్లీ: మతమార్పిడుల అంశంపై ఈరోజు లోక్సభ అట్టుడికింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇచ్చిన సమాధానంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. పలు పార్టీలు వాకౌట్ చేశాయి. ఆగ్రాలో మతమార్పిడుల అంశంపై సభలో సభ్యులు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో ఉద్రికతతలు లేవన్న మూలాయం సింగ్ యాదవ్ మాటలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు.
మత మార్పిడులు తీవ్రమైన అంశమని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో ఒక పార్టీని నిందించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరకదని చెప్పారు. అధికారులతో కేంద్ర హొం శాఖ సమావేశమైనట్లు తెలిపారు. ఆగ్రా మతమార్పిడుల అంశంపై యుపి ప్రభుత్వంతో మాట్లాడినట్లు చెప్పారు. ఇప్పటికే ఈ అంశంపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్లు తెలిపారు.
లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు, వారి విశ్వాసాల రక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నందుకు గర్విస్తున్నట్లు వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ స్సందనపై పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కొన్ని పార్టీల సభ్యులు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు.
**