గాంధీయేతర కుటుంబ వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు? | sonia gandhi may resign congress chief post, says Chidambaram | Sakshi
Sakshi News home page

గాంధీయేతర కుటుంబ వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు?

Published Fri, Oct 24 2014 2:18 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

గాంధీయేతర కుటుంబ వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు? - Sakshi

గాంధీయేతర కుటుంబ వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా? మరోసారి గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ చీఫ్గా వచ్చే అవకాశముందా? ఢిల్లీ వర్గాలు ఇందుకు అవుననే అంటున్నాయి. వరుస ఓటములతో కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి చిదంబరం ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే సోనియా ఉన్నంతవరకూ కాంగ్రెస్లో ఆమే నెంబర్ వన్ అని చిదంబరం వ్యాఖ్యానించారు.  ఓటమిల నేపథ్యంలో పార్టీ పునర్ వ్యవస్థీకరణను తక్షణమే చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. నాయకత్వం దీనిపై అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  బ్లాక్ మనీ జాబితాలో కాంగ్రెస్ నేత పేరు ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ మనోధైర్యం బాగా దెబ్బతిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement