సాక్షి ఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ 5 సూచనలు చేశారు. ఈ మేరకు మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. కరోనా వైరస్ కట్టడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి సలహాలు కోరిన నేపథ్యంలో సోనియా గాంధీ లేఖ రాశారు. ఎంపీల జీతాల కోతకు మద్దతు పలికారు. మీడియా అడ్వర్టైజ్ మెంట్లపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని పేర్కొన్నారు. నూతన పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపివేయాలని తెలిపారు. ప్రస్తుత చారిత్రాత్మక పార్లమెంటులోనే కార్యకలాపాలు కొనసాగించాలని సూచించారు.
ప్రభుత్వ ఖర్చును 30 శాతం తగ్గించుకోవాలని, కేంద్ర మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని తెలిపారు. పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని సూచించారు.
ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ధనం ఆదా అవుతుందని, ఈ డబ్బు ద్వారా కరోనా కట్టడి చర్యలకు ఉపయోగించవచ్చని సోనియా గాంధీ పేర్కొన్నారు.
కరోనా కట్టడిపై ప్రధానికి సోనియా సూచనలు
Published Tue, Apr 7 2020 2:03 PM | Last Updated on Tue, Apr 7 2020 2:32 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment