సమ్మె విరమించండి | stop lawyers strike, asks justice T.S Thakur | Sakshi
Sakshi News home page

సమ్మె విరమించండి

Published Mon, Jul 4 2016 3:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

సమ్మె విరమించండి

సమ్మె విరమించండి

ఆ తర్వాతే సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
తెలంగాణ న్యాయవాదులతో సీజేఐ
న్యాయాధికారుల నియామకాలు ఆపేయాలని విన్నవించిన లాయర్లు
హైకోర్టు విభజనలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

 
సాక్షి, న్యూఢిల్లీ
తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన సమ్మె విరమిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ హామీ ఇచ్చారని తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు.
 
 రాష్ట్రంలో న్యాయాధికారుల సస్పెన్షన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులను వివరించినట్లు న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఎం.రాజేందర్ రెడ్డి, జి.మోహన్‌రావు, జి.జితేందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. న్యాయాధికారుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, సస్పెన్షన్లు ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యలో జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. దాదాపుగా గంటసేపు జరిగిన సమావేశంలో తాము చెప్పిన విషయాలను ప్రధాన న్యాయమూర్తి సావధానంగా విన్నట్లు న్యాయవాదులు వివరించారు. కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయాధికారుల నియామకాలు జరిగాయని వారు వివరించారు.
 
 విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఒక కమిటీ వేసి నియామకాలు జరపాలన్న ప్రతిపాదనకు సీజేఐ కూడా అంగీకరించారన్నారు. ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రితో చర్చిస్తానని చెప్పారన్నారు. నిరసన విరమించుకుంటేనే తాను జోక్యం చేసుకుంటానని, లేకుంటే తప్పడు సంకేతాలు వేళ్లే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించినట్లు వారు వివరించారు. సీజేఐ సూచనపై హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement