
మమతా దూబే
రాయ్‌బరేలీ: చదువులు నేర్పే ఉపాధ్యాయురాలి మీద విద్యార్థులంతా ఏకమై దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. గాంధీ సేవా నికేతన్‌లో బోధిస్తున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారి మమతా దూబేపై సోమవారం ఈ దాడి జరిగింది. మొదట విద్యార్థులు ఆమె చుట్టూ చేరి వాదనకు దిగారు. ఒక విద్యార్థి ఆమె హ్యాండ్‌బ్యాగును విసిరేశాడు. ఆమె వెళ్లి ఆ బ్యాగును తెచ్చుకుంది. అనంతరం అదే విద్యార్థి ప్లాస్టిక్ కుర్చీతో పలుసార్లు ఆమెను కొట్టాడు.
ఈ సమయంలో మిగిలిన విద్యార్థులు చోద్యం చూస్తుండడం గమనార్హం. ఈ ఘటనలన్నీ సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. దీనిపై బాధితురాలు మమతా స్పందిస్తూ.. మేనేజర్‌తో భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే అతడు తనను ఇటీవల విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. దీనిపై తాను కలెక్టర్ నేహా శర్మను సంప్రదించినట్లు వెల్లడించారు. తనను విద్యార్థులు వాష్ రూంలో బంధించారని అధికారులకు చెబితే, పిల్లలు తమకు ఇష్టం వచి్చనట్లు చేస్తారని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారన్నారు. రెండు రోజుల తర్వాత నికేతన్‌కు వెళ్లగా విద్యార్థులు దాడి చేశారని తెలిపారు. మేనేజరే ఈ దాడి చేయించాడని ఆమె ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment