విద్యార్థులు మొబైల్స్ వాడటంపై ఆంక్షలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఓ పంచాయతీ.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడటంపై ఆంక్షలు విధించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే విద్యార్థులు మొబైల్ ఫోన్లలో మాట్లాడాలని తీర్మానించారు. మొబైల్ ఫోన్లు వాడటాన్నితాము వ్యతిరేకించడంలేదని, వాటిని నిరుపయోగం చేస్తున్నారని, అందుకే తాము నిబంధనలు విధించామని జాట్ మహాసభ సభ్యుడు సంతోష్ వర్మ చెప్పారు.
ఈ ఏడాది మొదట్లో గుజరాత్లోని ఓ గ్రామంలో మహిళలు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. మొబైల్ ఫోన్ వాడటం వల్ల చదువు నుంచి ఇతర వ్యాపకాలవైపు దృష్టి మళ్లిస్తుందని పంచాయతీ తీర్మానించింది.