using mobile phones
-
విద్యార్థులు మొబైల్స్ వాడటంపై ఆంక్షలు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో ఓ పంచాయతీ.. విద్యార్థులు మొబైల్ ఫోన్లు వాడటంపై ఆంక్షలు విధించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే విద్యార్థులు మొబైల్ ఫోన్లలో మాట్లాడాలని తీర్మానించారు. మొబైల్ ఫోన్లు వాడటాన్నితాము వ్యతిరేకించడంలేదని, వాటిని నిరుపయోగం చేస్తున్నారని, అందుకే తాము నిబంధనలు విధించామని జాట్ మహాసభ సభ్యుడు సంతోష్ వర్మ చెప్పారు. ఈ ఏడాది మొదట్లో గుజరాత్లోని ఓ గ్రామంలో మహిళలు సెల్ ఫోన్లు వాడటాన్ని నిషేధించారు. మొబైల్ ఫోన్ వాడటం వల్ల చదువు నుంచి ఇతర వ్యాపకాలవైపు దృష్టి మళ్లిస్తుందని పంచాయతీ తీర్మానించింది. -
సెల్ఫోన్ల సరదాకు ఇద్దరు అమ్మాయిలు బలి
అగర్తలా: సెల్ఫోన్ల సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు పదో తరగతి అమ్మాయిలు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్రిపురలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డన్ వారి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిలను మందలించారు. అనంతరం ముగ్గురు అమ్మాయిలు హాస్టల్ వీడి వెళ్లారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అగాయిత్యం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, ఈ సంఘటనలకు సంబంధించి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.