సెల్ఫోన్ల సరదాకు ఇద్దరు అమ్మాయిలు బలి | Rebuked for using mobile phones, two girls commit suicide | Sakshi
Sakshi News home page

సెల్ఫోన్ సరదాకు ఇద్దరు అమ్మాయిలు బలి

Published Sat, Sep 13 2014 1:21 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

సెల్ఫోన్ల సరదాకు ఇద్దరు అమ్మాయిలు బలి - Sakshi

సెల్ఫోన్ల సరదాకు ఇద్దరు అమ్మాయిలు బలి

అగర్తలా: సెల్ఫోన్ల సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. సెల్ఫోన్లు వాడరాదని మందలించినందుకు పదో తరగతి అమ్మాయిలు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. త్రిపురలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డన్ వారి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిలను మందలించారు. అనంతరం ముగ్గురు అమ్మాయిలు హాస్టల్ వీడి వెళ్లారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అగాయిత్యం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, ఈ సంఘటనలకు సంబంధించి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement