సాక్షి, లక్నో: అయోధ్య వివాదం సున్నీ, షియా వర్గాల మధ్య మంటలు రేపుతోంది. బాబ్రీ మసీదు విషయంలో సున్నీ వక్ప్ బోర్డుకు ఎటువంటి హక్కులు లేవని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. బాబ్రీ మసీదు, వివాదాస్పద స్థలం గురించి తమ వద్ద తగిన డాక్యుమెంట్లు ఉన్నాయని షియా వక్ప్‌బోర్డు ఛైర్మన్ వాసిమ్ రిజ్వీ ప్రకటించారు. ఈ డాక్యుమెంట్లను ఇప్పటికే సుప్రీం కోర్టు ముందుంచినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సున్నీ వక్ఫ్ బోర్డు మధుర, కాశీలోని మందిర్-మసీదు వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అదే సమయంలో అయోధ్య వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని వాసిమ్ రిజ్వీ స్పష్టం చేశారు.
వివాదాస్పద స్థలంపై కోర్టు షియా వక్ఫ్ బోర్డుకు అనులకూంగా తీర్పునిస్తే.. అందులో హిందువుల మనోభావాలకు అనుగుణంగా ఆలయం నిర్మించుకునేందుకు ఇచ్చేస్తామని ఆయన చెప్పారు. అదే సమయంలో లక్నోలో మరో మసీదు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment