నిన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసిన కాంగ్రెస్ రాష్ట్ర గ్రూపు నేతలు, సోమవారం అధినేత్రి సోనియా గాంధితో భేటీ అయ్యారు
అధినేత్రికి ఫిర్యాదుల చిట్టాలు
ఢిల్లీలోనే గ్రూపు నేతల మకాం
చెన్నై నుంచి ఈవీకేఎస్ పరుగు
చెన్నై : నిన్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిసిన కాంగ్రెస్ రాష్ట్ర గ్రూపు నేతలు, సోమవారం అధినేత్రి సోనియా గాంధితో భేటీ అయ్యారు. ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదుల చిట్టాలను అధినేత్రి ముందు ఉంచారు. ఈవీకేఎస్‌ను తప్పించాల్సిందేనని పట్టుబడుతూ గ్రూపు నేతలు ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. ఇక తన పదవిని కాపాడుకునేందుకు ఈవీకేస్ సిద్ధమయ్యారు.
తాను సైతం అంటూ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేశారు. రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగుర వేసిన గ్రూపుల నేతలు ఢిల్లీలో ఫిర్యాదులు వెల్లువెత్తిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ను పదవీచ్యుతుడ్ని చేయడం లక్ష్యంగా గ్రూపు నేతలు కంకణం కట్టుకుని ఉన్నారు.
ఢిల్లీలో తిష్ట వేసి ఉన్న ఈ నేతలు రాహుల్ గాంధీ ముందు ఇప్పటికే ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదుల చిట్టాను ఉంచారు. ఈవీకేఎస్‌ను తొల గించాల్సిందేనని పట్టుబట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం గ్రూపు నేతలు చిదంబరం, తంగబాలు, కుమరి ఆనందన్, కృష్ణస్వామి, వసంత కుమార్ తదితర పదకొండు మంది నాయకులు టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కారు.
సోనియాతో భేటీ..
టెన్ జన్‌పథ్ నుంచి ఆహ్వానం రావడంతో ఉదయాన్నే గ్రూపు నేతలు అక్కడికి పరుగులు తీశారు. సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అందరూ తమ తమ ఫిర్యాదులను అధినేత్రికి అందించారు. రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీకి మరింతగా గడ్డు పరిస్థితులను సృష్టించే విధంగా వ్యవహరిస్తున్న ఈవీకేఎస్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
గంటకు పైగా ఈ భేటీ సాగడంతో ఈవీకేఎస్‌ను పదవి నుంచి తప్పించి, తమందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నాయకుడ్ని నియమించాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డారు. ఈ భేటీ అనంతరం బయటకు వచ్చిన నా యకులు కొందరు మీడియాతో మాట్లాడుతూ ఈవీకేఎస్ చర్యలను తమ అధినేత్రి దృష్టికి తీసుకెళ్లామంటూ ముం దుకు సాగారు. ఈ గ్రూపు నేతలంద రూ ఇంకా ఢిల్లీలోనే తిష్ట వేసి ఉన్నారు.
ఢిల్లీకి ఈవీకేఎస్..
అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందా లే దా పదవిని రక్షించుకునే ప్రయత్నంలో ఈవీకేఎస్ ఉన్నారో తెలియదు కాని ఢిల్లీకి ఆయన కూడా పరుగులు పెట్టా రు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీలో గ్రూపు నేతలు తిష్ట వేసి రాజకీయం సాగి స్తుండటంతో ఈవీకేఎస్ మేల్కొన్నారు. చెన్నైలో ఉదయం జరిగిన మద్యం వ్యతిరేక నిరసనలో పాల్గొన్నానంతరం ఆగమేఘాలపై ఈవీకేఎస్ ఢిల్లీకి చెక్కేశారు.
అధిష్టానానికి అన్ని ఆధారాలు, సమాచారాలతో వివరణ ఇచ్చుకునేం దుకు తమ నేత సిద్ధంగానే ఉన్నారని, అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లారని ఈవీకేఎస్ మద్దతుదారులు పేర్కొం టున్నారు.