సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళను అండగా నిలిచేందుకు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతున్న కేరళ సోదర, సోదరీమణులను అదుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారు. 25కోట్ల రూపాయల భారీ విరాళంతోపాటు, రూ.2.5కోట్ల విలువైన 10 రివర్స్ ఓస్మోసిస్ ప్లాంట్లను కేరళకు అందిస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.
మరోవైపు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల విరాళం అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. అలాగే కేరళ వరద పరిస్థితిపై సీఎం పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
To aid & assist our brothers & sisters of Kerala in their hour of grief, Telangana CM Sri KCR Garu has just announced assistance of Rs. 25 Cr & 10 reverse osmosis plants worth 2.5 Cr towards the flood hit Kerala#TelanganaStandsWithKerala
— KTR (@KTRTRS) August 17, 2018
Request you all to donate generously🙏 pic.twitter.com/SGHi2kcKjV
Comments
Please login to add a commentAdd a comment