
సాక్షి, అమరావతి: కేరళలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. శనివారం ఈ బృందాలు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు బయల్దేరాయి. 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), జిల్లా అగ్నిమాపక అధికారి, జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి, అయిదుగురు స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, బోట్ మెకానిక్, ఈత శిక్షకుడు, 12 మోటార్ బోట్లు, ఇతర రక్షణ పరికరాలు తదితరాలు ఈ బృందంలో ఉన్నాయి.