
మరో ఉగ్రదాడికి పన్నాగం
న్యూఢిల్లీ: మరోసారి భారత్ లో ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదం ఉందని ఐబీ(నిఘా సంస్థ) హెచ్చరికలు జారీ చేసింది. జనవరి 28వ తేదీకి ముందే ఉగ్రవాదులు భారీ విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నినట్లు ఐబీ తెలిపింది. ప్రధానంగా యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
లష్కరే, ఐఎం, జైషే జమార్ గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ఇప్పటికే భారత్ లోకి ప్రవేశించినట్లు తాజాగా పేర్కొంది. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.