ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాష్ట్రాల పన్నులకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పు వెల్లడించింది. తమ రాష్ట్రాల్లోకి ప్రవేశించే వస్తువులపై పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా పన్ను విధించడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం లేదని తెలిపింది. రాష్ట్రాల పన్నులకు సంబంధించి కీలకమైన ఈ అంశంపై 9 మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం 7-2 తేడాతో తీర్పును వెలువరించింది.