చట్టసభల పనితీరును మార్చాలి
విప్‌ల సదస్సులో కేంద్రమంత్రి వెంకయ్యునాయుుడు
పణజి: పార్లమెంటు, అసెంబ్లీల పనితీరుపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం ఆందోళన కలిగిస్తోందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యునాయుుడు అన్నారు. సోమవారం గోవాలో అఖిల భారత విప్‌ల సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,నేరవుయు రాజకీయూలు, డబ్బుల ప్రమేయుం పెరగడం, సమావేశాల సంఖ్య తగ్గడం, పదేపదే వాయిదాలు, సభ బయట, లోపల కొందరు సభ్యుల ప్రవర్తన సరిగా లేకపోవడం వంటి కారణాలవల్ల చట్టసభల ప్రతిష్ట దెబ్బతింటోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో పవిత్ర వ్యవస్థలైన చట్టసభల పనితీరును మార్చాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వచ్చే డబ్బుతో చట్టసభలు నడుస్తున్నాయుని, అరుుతే సమావేశాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని వెంకయ్యు ఆవేదన వ్యక్తంచేశారు.