ఆవుల స్మగ్లర్‌ను కొట్టిచంపిన జనం | The man was lynched because of rumours that he was engaged in cattle smuggling, according to his brother | Sakshi
Sakshi News home page

ఆవుల స్మగ్లర్‌ను కొట్టిచంపిన జనం

Published Sat, Oct 17 2015 2:31 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

ఆవుల స్మగ్లర్‌ను కొట్టిచంపిన జనం - Sakshi

ఆవుల స్మగ్లర్‌ను కొట్టిచంపిన జనం

నహన్(హిమాచల్): ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను ప్రజలు కొట్టిచంపిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.  ఐదు ఆవులు, పది ఎద్దులున్న ట్రక్కు వెళుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటాడారు.  డ్రైవర్ వాహనాన్ని లవాసా వద్ద నిలిపేసి.. అందులోని కొన్ని జీవాల్ని కిందకు తోసేశాడు.  ఓ ఆవు చనిపోగా, మరో ఐదు జీవాలు గాయపడ్డాయి. ట్రక్కులోని ఐదుగురు స్మగ్లర్లు దగ్గర్లోని అడవుల్లోకి పరారయ్యారు. స్థానికుల సాయంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

స్మగ్లర్లమీద ఆగ్రహంతో ఊగిపోతున్న గ్రామస్తులు పోలీసులు వారిస్తున్నా వినకుండా  వారిని తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన నోమన్(22) అనే ఆవుల స్మగ్లర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే మరణించాడు. అతణ్ని ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ జిల్లాకు చెందిన రాంపూర్ గ్రామవాసిగా గుర్తించారు. గ్రామస్తులపై హత్య కేసు నమోదైంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement