ఈ-వ్యర్థాల్లో 4.5 లక్షల మంది బాలలు
ప్రమాదకర పరిస్థితుల్లో కార్యకలాపాలు అసోచామ్ ఆందోళన
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల(ఈ-వేస్ట్) సేకరణ, రీసైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో సుమారు 4.5 లక్షల మంది బాల కార్మికులు పనిచేస్తున్నారని అసోచామ్ వెల్లడించింది. 10-14 ఏళ్ల మధ్య వయసుల్లోనే ఉన్న వీరంతా సరైన రక్షణ, ప్రమాణాలు లేని వర్క్‌షాపుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ వంటి పనులకు బాలలను వినియోగించకుండా చట్టాన్ని తీసుకురావాలని సిఫారసు చేసింది. మౌలిక వసతుల లేమి కారణంగా సేకరించిన మొత్తం ఈ-వ్యర్థాల్లో 4 శాతం మాత్రమే రీసైకిల్(పునర్వినియోగం) అవుతున్నాయని, దీనివల్ల పర్యావర ణానికీ నష్టం కలుగుతోందని తెలిపింది.
ఈ-వ్యర్థాల్లో 95% అసంఘటిత రంగం నుంచే వస్తున్నాయని, వాటిని తుక్కు డీలర్లు రీసైకిల్ చే యకుండా భాగాలుగా విడగొట్టి పారేస్తున్నారంది. అసోచామ్ ప్రకారం.. దేశంలో ఏటా 12.5 లక్షల మెట్రిక్‌టన్నుల ఈ-వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా.. 2015 నాటికి 15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోనుంది. ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి అవుతున్న నగరాల్లో ముంబై (96 వేల మెట్రిక్ టన్నులు) మొదటిస్థానంలో ఉండగా.. తర్వాత ఢిల్లీ (67 వేలు), బెంగళూరు (57 వేలు), చెన్నై (47 వేలు), హైదరాబాద్ (25 వేలు) ఉన్నాయి.