ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఖరారైంది. ఢిల్లీలో జరిగే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ప్రాంతీయ భేటీలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత్‌కు రానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్‌తో భేటీ కానున్నారు.