త్రిపుర సీఎం విప్లవ్‌కుమార్ దేవ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, అగర్తలా : సివిల్ ఇంజనీర్లు మాత్రమే సివిల్ సర్వీసులు చేపట్టాలని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ నేతల వెంటపడరాదని సూచించారు. చదువుకున్న యువత పాన్ షాపులు పెట్టుకుని స్వయం ఉపాధికి మొగ్గుచూపాలని సర్కారీ కొలువుల కోసం నేతలపై ఒత్తిడి పెంచవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూడకుండా ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రుణాలు పొంది వివిధ వ్యాపారాలు చేపట్టేందుకు మొగ్గుచూపాలని సలహా ఇచ్చారు.
త్రిపుర యువకులు ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి తమ విలువైన సమయం వృధా చేసుకుంటున్నారని, నేతల చుట్టూ తిరిగే బదులు సొంతంగా పాన్ షాపు పెట్టుకుని ఉంటే ఆయా యువకుల వద్ద ఈపాటికి రూ 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదని అన్నారు. రూ 75 వేల బ్యాంకు రుణంతో నిరుద్యోగ యువత నెలకు సులువుగా రూ 25,000 ఆర్జించవచ్చని చెప్పుకొచ్చారు. చదువుకున్న వారు వ్యవసాయం, పౌల్ర్టీ పనులు వంటివి చేయరాదనే చులకన భావం ప్రజల్లో నెలకొందని అన్నారు. స్టార్టప్ ప్రాజెక్టులకు ప్రధాని ప్రవేశపెట్టిన ముద్ర రుణంతో యువకులు గౌరవంగా స్వయం ఉపాధితో జీవించే అవకాశం ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment