ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచండి | TRS MPs met Arun Jaitley | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచండి

Published Tue, Jun 13 2017 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

TRS MPs met Arun Jaitley

అరుణ్‌ జైట్లీని కోరిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
 
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ 19 శాతం వృద్ధి రేటుతో అభివృద్ధి సాధిస్తోందని, అందువల్ల రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచి రుణాలు తీసుకొనే పరిమితి పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని అదనంగా 0.5 శాతం పెంచాలని కోరారు. వెనుకబడ్డ జిల్లాలకు రావాల్సిన రూ.450 కోట్ల మూడో విడత నిధులు విడుదల చేయాలని అరుణ్‌ జైట్లీని కోరినట్లు సమావేశం అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement