ముంబై : లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. చాలామంది టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. దేశంలో వారం రోజుల్లో టీవీ వీక్షణం రికార్డు స్థాయిలో 37 శాతం పెరిగినట్లు బ్రాడ్‌కాస్టు ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గురువారం ప్రకటించింది. లాక్‌డౌన్ కొనసాగినంత కాలం టీవీ వీక్షణం ఇదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని బార్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ లుల్లా చెప్పారు. నాన్–ప్రైమ్‌టైమ్‌లోనూ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని తెలిపారు. ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడంతో.. వారి కాలక్షేపం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పలు సీరియల్స్‌ను ప్రసారం చేస్తోన్న విషయం తెలిసిందే. రామాయణం, శక్తిమాన్ వంటి ప్రజల ఆధరాభిమానాలను పొందిన సీరియల్స్ బుల్లితెరపై మరోసారి సందడి చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా సాధారణంగానే టీవీలకు అతుక్కుపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment