సాక్షి,న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు బీజేపీ సీనియర్ నేతలను ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా టార్గెట్ చేసినట్టు వెల్లడైంది. లక్నోలో అరెస్టయిన లష్కరే ఉగ్రవాది అబ్దుల్ నయీమ్ షేక్ విచారణలో ఈ అంశం వెలుగుచూసినట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. నయీమ్ షేక్ లాహోర్‌లో పలువురితో టచ్‌లో ఉంటూ ఇద్దరు సీనియర్ బీజేపీ నేతలను తన హిట్‌లిస్ట్‌లో పొందుపరిచినట్టు సమాచారం.
నయీమ్ ఇప్పటికే కాశ్మీర్‌కు వెళ్లి పలు సైనిక స్ధావరాలు, విద్యుత్ ప్రాజెక్టులు వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్టు తెలిసింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్ ఎన్నికల వేళ భయోత్పాతం సృష్టించేందుకు లక్నోలోని స్లీపర్ సెల్ సాయంతో చెలరేగాలని నయీమ్ షేక్ స్కెచ్ వేసినట్టు తెలిసింది.
పాకిస్తాన్ నుంచి లష్కరే శ్రేణుల ద్వారా నయీమ్ సహా ఇతర ఉగ్రమూకలకు ఎప్పటికప్పుడు సూచనలు అందుతున్నట్టు అనుమానిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు చెందిన నయీమ్ షేక్‌కు పలు ఉగ్ర కేసులతో సంబంధాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment