జమ్ము కాశ్మీర్ ప్రజలను రెండు పార్టీలు దోచుకుంటున్నాయని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఈ వారసత్వ పాలనకు ఇక చరమగీతం పాడాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు. జమ్ములోని కిష్ట్వార్ పట్టణంలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడారు. పాలక నేషనల్ కాన్ఫరెన్స్, ప్రతిపక్ష పీడీపీల పేర్లు ఎక్కడా ప్రస్తావించకుండానే.. వాటిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక కుటుంబం అధికారంలోకి వచ్చి, ఐదేళ్ల పాటు దోచుకుంటుందని, తర్వాత అది అప్రదిష్ఠపాలు అయ్యి, రెండో కుటుంబానికి పాలించే అవకాశం ఇస్తుందని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలు రాజకీయ మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడుతున్నాయన్నారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం ఐదు దశల్లో నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 23న విడుదలవుతాయి. రాష్ట్రంలో మొత్తం 88 అసెంబ్లీ స్థానాలుండగా కనీసం 50 చోట్ల గెలవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. వరదల తర్వాత అధికారంలో ఉన్న ఎన్సీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో మోదీ స్వయంగా పర్యటించి 700 కోట్లు ఇవ్వడం, సియాచిన్ ప్రాంతంలో సైనికులతో దీపావళి చేసుకోవడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.
'రెండు కుటుంబాలు దోచుకుంటున్నాయి'
Published Sat, Nov 22 2014 5:50 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement