
సాక్షి, చెన్నై : లాక్‌డౌన్ కారణంగా కనీస అవసరాలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్న లక్షలాది మందిని ఆదుకునేందుకు చాలామంది మందుకువస్తున్నారు. వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ.. అభాగ్యులకు ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద వాళ్లను ఆదుకునేందకు మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది. అయితే మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం చెరో రూపాయి మాత్రమే ఇచ్చారు. మరో ఇద్దరు లాయర్లు ఒక్కొక్కరు పది రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బును బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పుదుచ్చేరీలకు లాక్‌డౌన్ రిలీఫ్ ఫండ్‌కు ఆన్‌లైన్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు.
ఇప్పటి వరకూ బార్ కౌన్సిల్ రూ.60లక్షల రూపాయలు సేకరించింది. వీటన్నింటినీ లాక్‌డౌక్ కారణంగా అవస్తలు పడుతున్న వారికి సహాయంగా ఉపయోగించనుంది. అత్యధికంగా విరాళం ఇచ్చిన వారిలో జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం రూ.2.5లక్షలు విరాళమిచ్చారు. చాలా మంది లాయర్లు ఒక్కొక్కరు రూ.5లక్షలు చొప్పున ఇచ్చారు. కాగా లాక్‌డౌన్ రిలీఫ్ ఫండ్ కోసం విరాళాలు ఇచ్చిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment