
ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
ఢిల్లీ: నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే పరిస్థితులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఉగ్ర కుట్ర బయటపడింది. నొయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తుండగా శుక్రవారం పోలీసులకు చిక్కారు. ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద లభించిన ల్యాప్ టాప్ లో కీలక సమాచారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం.