న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 51 కోట్ల మందికి ఆధార్ సంఖ్యను జారీ చేసినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గురువారం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 60 కోట్ల మందికి ఆధార్ సంఖ్య కేటాయించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. రోజూ 11 లక్షల మందికి ఆధార్ సంఖ్య జారీ అవుతోందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్‌లలో ఆధార్ జారీ 90 శాతానికి చేరిందని తెలిపింది.
51 కోట్ల మందికి ‘ఆధార్’
Published Fri, Dec 6 2013 5:51 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement