ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలో ఆరు కొత్త ఐఐటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేసే చట్ట సవరణకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ద ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961కు సవరణ చేయడం ద్వారా ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కూడా ఒక ఐఐటీగా మారుతుంది.
దాంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, కేరళలోని పాలక్కాడ్, కర్ణాటకలోని ధార్వార్, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, గోవా, జమ్ములలో ఈ కొత్త ఐఐటీలు వస్తాయి. చట్ట సవరణ వల్ల ఈ సంస్థలకు జాతీయ ప్రాధాన్యం వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుపతి ఐఐటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Published Wed, May 25 2016 7:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM